MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కొత్త చిత్రం.. ఇంట్రెస్టింగ్ డిటైల్స్

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కొత్త చిత్రం.. ఇంట్రెస్టింగ్ డిటైల్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అశోక్ కొత్త చిత్రం ఆరంభించాడు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Sep 21 2024, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ashok Galla

Ashok Galla

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. ప్రతిభావంతుడైన యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Ashok Galla

Ashok Galla

సినీ ప్రముఖల సమక్షంలో చిత్ర ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా మరియు మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.

రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అశోక్ గల్లాతో పాటు 'మ్యాడ్' ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ, 'కోట బొమ్మాళి పి.ఎస్' ఫేమ్ రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 

35
Ashok Galla

Ashok Galla

అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు ఉద్భవ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిత్ర బృందం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.

ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా ఉంటుందని.. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.
 

45
Ashok Galla

Ashok Galla

ప్రతిభగల ఛాయాగ్రాహకుడు భరద్వాజ్ ఆర్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
 

55
Ashok Galla

Ashok Galla

తారాగణం, సాంకేతిక సిబ్బంది వివరాలు:

తారాగణం: అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియా, రాహుల్ విజయ్, శివాత్మిక
రచన, దర్శకత్వం: ఉద్భవ్
ఛాయాగ్రాహకుడు: భరద్వాజ్ ఆర్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved