- Home
- Entertainment
- మహేష్, శ్రీలీల, మీనాక్షి, నమ్రత, దిల్‌రాజు దంపతులు.. `గుంటూరు కారం` సక్సెస్ పార్టీలో రచ్చ..మరి త్రివిక్రమ్?
మహేష్, శ్రీలీల, మీనాక్షి, నమ్రత, దిల్‌రాజు దంపతులు.. `గుంటూరు కారం` సక్సెస్ పార్టీలో రచ్చ..మరి త్రివిక్రమ్?
`గుంటూరు కారం` సినిమా సంక్రాంతి విడుదలై మంచి కలెక్షన్లని రాబడుతున్న నేపథ్యంలో తాజాగా పార్టీ చేసుకున్నారు. హీరోహీరోయిన్లు, నిర్మాతలు కలిసి రచ్చ చేశారు.

మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి హీరోహీరోయిన్లుగా `గుంటూరు కారం` చిత్రం రూపొందింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మూవీ ఇది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మించింది. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని శుక్రవారం ఈ మూవీ విడుదలైంది.
ఈ మూవీకి ప్రారంభం నుంచి మిక్స్ డ్ టాక్ వస్తుంది. సినిమా కూడా యావరేజ్‌గా ఉంది. కానీ దీనిపై టూ మచ్ నెగటివిటీ వస్తుంది. బీఎంఎస్(బుక్ మై షో) దారుణంగా నెగటివ్ ఓటింగ్ జరిగింది. ఇది కొందరు కావాలని చేశారనే ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబుని టార్గెట్ చేసి కొందరు చేశారని అంటున్నారు.
అదే సమయంలో నిర్మాత దిల్ రాజు కూడా ఈ నెగటివ్ ప్రచారానికి కారణమయ్యాడని అంటున్నారు. ఏదేమైన ఈ మూవీపై నెగటివ్ ప్రచారం బాగా ఎఫెక్ట్ పడింది. అదే పాజిటివ్ ప్రచారం జరిగి ఉంటే కలెక్షన్లు మరింతగా పెరిగేవి. సంక్రాంతి విన్నర్‌గా నిలిచినా ఆశ్చర్యం లేదు. మరి ఇంతటి ప్రచారానికి రీజన్ తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా చిత్ర బృందం పార్టీ చేసుకుంది. సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో సోమవారం టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. మహేష్‌బాబు, ఆయన భార్య నమ్రత, అలాగే శ్రీలీల, మీనాక్షి చౌదరి సందడి చేశారు.
వీరితోపాటు సినిమాని నిర్మించిన నాగవంశీ, సినిమాని నైజాంలో కొన్న దిల్‌రాజు, ఆయన సతీమణి హల్‌చల్ చేశారు. వీరితోపాటు దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే సితార, గౌతమ్, మెహర్ రమేష్ వారి ఫ్యామిలీ సైతం ఇందులో సందడి చేయడం విశేషం. కానీ దర్శకుడు త్రివిక్రమ్ ఇందులో పాల్గొనకపోవడం ఆశ్చర్యంగా మారింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు టీమ్ అందరికి పార్టీ ఇచ్చారు. తన ఇంట్లో ఈ సక్సెస్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా శ్రీలీల రచ్చ చేసింది. సెల్ఫీలతో అదరగొట్టింది.
ఇక `గుంటూరు కారం` మూడు రోజుల్లో 164కోట్ల కలెక్షన్లని సాధించింది. మొదటి రోజు 94కోట్లు, రెండో రోజు 33, మూడో రోజులు 37కోట్లు వసూలు చేసింది. సోమవారం కూడా కలెక్షన్లు బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ వీకెండ్‌లో ఇది 200కోట్ల మార్క్ ని టచ్ అవుతుందా అనేది చూడాలి. ఈ మూవీకి 132కోట్ల బిజినెస్ అయ్యింది. రికవరీ అవ్వాలంటే 260కోట్ల గ్రాస్ రావాలి. కానీ కొంత నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
మహేష్ బాబు, నమ్రత దంపతులు ఇచ్చి న `గుంటూరు కారం` సక్సెస్ పార్టీలో సందడి చేసిన మూవీ టీమ్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మహేష్ బాబు, నమ్రత దంపతులు ఇచ్చి న `గుంటూరు కారం` సక్సెస్ పార్టీలో సందడి చేసిన మూవీ టీమ్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మహేష్ బాబు, నమ్రత దంపతులు ఇచ్చి న `గుంటూరు కారం` సక్సెస్ పార్టీలో సందడి చేసిన మూవీ టీమ్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మహేష్ బాబు, నమ్రత దంపతులు ఇచ్చి న `గుంటూరు కారం` సక్సెస్ పార్టీలో సందడి చేసిన మూవీ టీమ్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.