తెలుగు స్టార్ హీరో మూవీ అట్టర్ ఫ్లాప్, ఎంతలా ట్రోల్ చేశారో తెలుసా.. అదే స్టోరీ హాలీవుడ్ లో సంచలనం
తెలుగు స్టార్ హీరో సినిమా విషయంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయిన చిత్ర కథని పోలివుండే మూవీ కొన్నేళ్ల తర్వాత హాలీవుడ్ లో వచ్చింది.

Dune 2 Movie
సినిమాల విషయంలో కథలు కాపీ అవుతుంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా ఇద్దరు దర్శకులు ఒకే కథతో సినిమా చేయొచ్చు. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి పటాస్, టెంపర్ చిత్రాల కథలో కోర్ పాయింట్ ఒకటే. కానీ పూరి జగన్నాధ్, అనిల్ రావిపూడి ఈ చిత్రాలని వేర్వేరుగా వారి స్టైల్ లో చిత్రీకరించారు.

Dune 2 movie
తెలుగు స్టార్ హీరో సినిమా విషయంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయిన చిత్ర కథని పోలివుండే మూవీ కొన్నేళ్ల తర్వాత హాలీవుడ్ లో వచ్చింది. అక్కడ ఆ కథకి ప్రేక్షకులు జేజేలు పట్టారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే మహేష్ బాబు నటించిన ఖలేజా. దాదాపుగా ఖలేజా లాంటి కథతోనే హాలీవుడ్ లో గత ఏడాది డ్యూన్ 2 చిత్రం విడుదలయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది.
తిమోతి ఛాల్మెట్ ప్రధాన పాత్రలో నటించారు. ఖలేజా చిత్రాన్ని త్రివిక్రమ్ ఒక ఊరి నేపథ్యంలో తెరకెక్కించారు. కానీ డ్యూన్ 2 చిత్రాన్ని ఒక గ్రహం నేపథ్యంలో రూపొందించారు. ఖలేజా చిత్రంలో కూడా ఊరి ప్రజలని నాశనం చేసి అక్కడ దొరికే విలువైన ఖనిజాన్ని దోచుకోవాలనేది విలన్ ప్లాన్. తమని రక్షించే దేవుడి కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. నువ్వే ఆ దేవుడివి అని మహేష్ కి ప్రజలు చెప్పినా పట్టించుకోడు.
డ్యూన్ 2 కథ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అకీరాస్ గ్రహంతో ఎంతో విలువైన ఒక డ్రగ్ దొరుకుతుంది. దానిని దక్కించుకోవడానికి విలన్ తన ఆర్మీతో ప్రయత్నిస్తుంటాడు. ఫ్రెమేగ్ తెగని అంతం చేసి ఆ డ్రగ్ ని పొందాలని ప్రయత్నిస్తుంటాడు. తమని రక్షించే దేవుడి కోసం ఆ గ్రహంలోని ప్రేమేగ్ తెగ ప్రజలు ఎదురుచూస్తుంటారు. కానీ వారికి రక్షకుడిగా మారేందుకు హీరోకి ఇష్టం ఉండదు. చివరికి హీరో ఎలా రక్షకుడిగా మారాడు అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో విజువల్స్, సరికొత్త గ్రహం నేపథ్యంలో సృష్టించిన ప్రపంచం అబ్బురపరిచేలా ఉంటాయి.
ఫలితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వేలకోట్ల వసూళ్లు రాట్టింది. కానీ ఖలేజా చిత్రం తెలుగులో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబుని త్రివిక్రమ్ దేవుడిగా చూపించడంతో అప్పట్లో పెద్ద ట్రోలింగ్ జరిగింది.

