- Home
- Entertainment
- మహేష్ బాబు పోస్ట్ వైరల్, జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నామంటూ.. లండన్ ఫోటోలు శేర్ చేసిన సూపర్ స్టార్
మహేష్ బాబు పోస్ట్ వైరల్, జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నామంటూ.. లండన్ ఫోటోలు శేర్ చేసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టడం తక్కువ, అది కూడా ఫ్యామిలీ ఫోటోలకంటే.. సినిమాకు సంబంధించిన ఫోటోలతో ట్వీట్ చేస్తుంటారు. అంటువంటిది సూపర్ స్టార్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇటలీ టూర్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో సందడి చేశారు.

గ్యాప్ దొరికితే చాలు ఫారెన్ టూర్లతో ఎంజాయ్ చేస్తుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ. షూటింగ్ గ్యాప్ తొరికితే ఫారెన్ ప్లైట్ ఎక్కిస్తుంటారు సూపర్ స్టార్ ఫ్యామిలీ.. ఇక ఇప్పుడు మహేష్ లండన్ లో ఉన్నాడు.
మహేశ్ బాబు కుటుంబ సమేతంగా యూరోప్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే స్విట్జర్లాండ్ లో అందాలను చుట్టేసిన ఈ కుటుంబం అక్కడి నుంచి ఇటలీకి చేరుకుంది. భార్య నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలసిన ఫొటోలను మహేశ్ బాబు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఈ ఫ్యామిలీకి సంబంధించి ఫోటోస్ అయినా.. ఇంకేదైనా.. నమ్రతనే పోస్ట్ చేస్తుంది.. ఏదున్నా ఆమే చూసుకుంటుంది మహేష్ ఈ విషయాలోలో తక్కువగా స్పందిస్తారు.కాని ఈసారి మాత్ర సూపర్ స్టార్ స్వయంగా ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెల్ఫీలో ముందు నమ్రత, సితార ఉంటే, వెనుక మహేశ్, గౌతమ్ నవ్వులు చిందిస్తున్నారు.
ఈ ఫోటోలకు అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు మహేష్. ఇక్కడ ఇప్పుడు.. జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నాం అని మహేశ్ బాబు క్యాప్షన్ తగిలించారు. మహేశ్ షేర్ చేసిన ఫొటోలకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. తమ అభిమాన నటుడిని.. ఫ్యామిలీని చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్.
ఇటలీకి ముందు వీరంతా స్విట్జర్లాండ్ లోని ట్రిప్ కు వెళ్లారు. . స్విట్జర్లాండ్ పర్యటన ఫొటోలను నమ్రత ఇప్పటికే షేర్ చేస్తూనే ఉంది. ఇక స్విట్జర్లాండ్ కంటే ముందు వీరు జర్మనీలోనూ పర్యటించారు. సితార స్కూటర్ తో ఫోజు ఇచ్చే ఫొటోను వారు అభిమానులతో పంచుకున్నారు.