MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమ్మ కోసమే త్రివిక్రమ్ మూవీ పక్కన పెట్టిన మహేష్... చివరి రోజుల్లో ఇందిరా దేవి పక్కనే! 

అమ్మ కోసమే త్రివిక్రమ్ మూవీ పక్కన పెట్టిన మహేష్... చివరి రోజుల్లో ఇందిరా దేవి పక్కనే! 

దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలు కాగా.. మధ్యలో ఆపేసిన విషయం తెలిసిందే. దీనికి అనేక కారణాలు వినిపించినా అమ్మ కోసమే మహేష్ షూటింగ్ ఆపారని తాజాగా వెలుగులోకి వచ్చింది.

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 28 2022, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న SSMB 28 మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రత్యేకమైన సెట్స్ పై మహేష్ పై యాక్షన్ సన్నివేశాలతో పాటు ఇతర సన్నివేశాల చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. అయితే మొదలయ్యాక అర్థాంతరంగా షెడ్యూల్ ఆగిపోయింది. దానికి కారణం యాక్షన్ కొరియోగ్రాఫర్ తో వచ్చిన సమస్య కారణంగా చిత్రీకరణ ఆపారంటూ ప్రచారం జరిగింది. 
 

26
Mahesh babu

Mahesh babu


అయితే అసలు నిజం వేరే ఉన్నట్లు తాజాగా బయటికి వచ్చింది. తల్లి ఇందిరా దేవి కోసమే మహేష్ షూటింగ్ అపారని సమాచారం. చాలా కాలంగా ఇందిరా దేవి వీల్ చైర్ కి పరిమితమయ్యారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వయసురీత్యా ఆమెను కాపాడుకునే పరిస్థితి లేదు. ఇందిరా దేవి జీవించేది తక్కువ కాలమే అని వైద్యులు చెప్పారు. 
 

36

ఇక వారం రోజులుగా ఇందిరా దేవి ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరి రోజుల్లో అమ్మ పక్కనే ఉండాలని భావించిన మహేష్ బాబు త్రివిక్రమ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. షూటింగ్ మధ్యలో ఆపేసి అమ్మతో గడిపారు. అమ్మ ఇందిరా దేవి అంటే మహేష్ కి విపరీతమైన ప్రేమ. అమ్మ కోసం ఆయన త్రివిక్రమ్ మూవీ తాత్కాలికంగా పక్కన పెట్టారని సమాచారం అందుతుంది.

46

ఇక ఇందిరా దేవి అంత్యక్రియలు మహేష్ చేతుల మీదుగా జరగనున్నాయి. మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందిరా దేవి మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇందిరా దేవి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నారు. ప్రముఖులు ఇందిరా దేవి భౌతిక కాయాన్ని స్వయంగా సందరిస్తున్నారు.

56
Indira Devi

Indira Devi


ఇక ఇందిరా దేవి మరణం నేపథ్యంలో మరికొన్ని రోజులు మహేష్ త్రివిక్రమ్ మూవీ షూటింగ్ హోల్డ్ లో పెట్టే సూచనలు కలవు. 2023 సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల చేయాలని మేకర్స్ ఆలోచన. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. మరి ఇంత తక్కువ సమయంలో చెప్పిన సమయానికి మూవీ విడుదల చేయగలరా అనే సందేహాలు మొదలయ్యాయి. 

66

కాగా గతంలో తల్లితో తనకున్న అనుబంధాన్ని మహేష్ ఓ ఈవెంట్ లో తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మహర్షి మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ మాట్లాడుతూ... ''అమ్మ నాకు దేవుడితో సమానం. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు అమ్మ దగ్గరకు వెళ్లి ఒక కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగుతుంటే నాకు గుడిలో ప్రసాదం తింటున్నట్లు ఉంటుంది. ఆమె దీవెనలు నాకు ఎంతో అవసరం. అందుకే ఈ మూవీ సక్సెస్ ప్రపంచంలో ఉన్న తల్లులు అందరికీ అంకితం'' అంటూ మహేష్ చెప్పుకొచ్చారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న
Recommended image3
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved