- Home
- Entertainment
- ఎన్టీఆర్, చరణ్ పెర్ఫామెన్స్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్.. RRR పై సూపర్ స్టార్ రివ్యూ
ఎన్టీఆర్, చరణ్ పెర్ఫామెన్స్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్.. RRR పై సూపర్ స్టార్ రివ్యూ
ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంపై మహేష్ బాబు తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన అనంతరం మహేష్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.

RRR Movie
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ మొదలయింది. బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కించిన చిత్రం.. పైగా ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్స్ నటించిన మూవీ కావడంతో ఊహకు అందని అంచనాలు ఏర్పడ్డాయి.
RRR Movie
ఇలాంటి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంచనాలని మించేలా బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఇండియన్ సినిమాలో మరే చిత్రానికి సాధ్యం కానీ రికార్డు అనే చెప్పాలి. ఇందులో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 73 కోట్ల షేర్ రాబట్టింది.
RRR Movie
ఆర్ఆర్ఆర్ ప్రభంజనం బాలీవుడ్ కు సైతం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం వెండితెరపై చేస్తున్న మ్యాజిక్ కు ప్రముఖులు సైతం ముగ్దులు అవుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెడుతూ ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
RRR Movie
'నార్మల్ సినిమాలు వేరు.. రాజమౌళి సినిమాలు వేరు. ఆర్ఆర్ఆర్ ఒక ఎపిక్. భారీ స్కేల్ లో తెరకెక్కించిన విధానం, గ్రాండ్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ ఇలా ప్రతి అంశం ఊహకు అందని విధంగా ఉన్నాయి. మిమ్మల్ని మీరు మరచిపోయి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లో లీనమైపోయే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. అది కేవలం మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి గారికి మాత్రమే సాధ్యం. సెన్సేషనల్ ఫిలిం మేకింగ్.. రాజమౌళిని చూస్తే గర్వంగా ఉంది.
RRR Movie
రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ వారి స్టార్ డం ని దాటిపోయి నటించారు. ఇద్దరి పెర్ఫామెన్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అనిపిస్తుంది. నాటు నాటు సాంగ్ లో ఇద్దరికి గ్రావిటీ నియమం వర్తించినట్లు లేదు. గాల్లో తేలిపోతున్నారు. చిత్ర యూనిట్ మొత్తానికి హ్యాట్సాఫ్' అంటూ మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ చిత్రానికి తన రివ్యూ ఇచ్చారు.
RRR Movie
దాదాపు మూడేళ్ళ పాటు రాంచరణ్, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఇద్దరికీ ఈ చిత్రం కెరీర్ బెస్ట్ ఫిలిం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే. మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్ర అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.