MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు నడిపిన మొదటి బైక్ మోడల్ ఇదే... 11 ఏళ్ల వయసులోనే రయ్ రయ్ మంటూ సాహసం!

మహేష్ బాబు నడిపిన మొదటి బైక్ మోడల్ ఇదే... 11 ఏళ్ల వయసులోనే రయ్ రయ్ మంటూ సాహసం!

హీరో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే సాహసాలు చేశాడు. మహేష్ బాబు ఓ సందర్భంలో తన మొదటి బైక్ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. 11 ఏళ్ల వయసులో తాను నడిపిన బైక్ మోడల్ చెప్పారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 20 2024, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు వెండితెరకు పరిచయం అయ్యాడు. పసిప్రాయంలోనే నటుడిగా మారాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది చిత్రాలు చేశాడు. తండ్రి కృష్ణ, అన్నయ్య రమేష్ బాబులతో కలిసి నటించాడు. మహేష్ బాబు చిన్నప్పుడే స్టార్డం అనుభవించడం విశేషం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

డ్యూయల్ రోల్స్, సూపర్ కిడ్, మల్టీస్టారర్స్ చేశాడు. ఈ క్రమంలో బాల్యంలోనే బైక్ రైడ్, హార్స్ రైడింగ్ వంటి సాహసాలు చేశాడు. 1990లో వచ్చిన బాల చంద్రుడు మూవీలో మహేష్ మెయిన్ లీడ్. కాకపోతే అప్పటికీ ఆయన చైల్డ్ ఆర్టిస్టే. 

 

38

1999లో మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకుడు రాఘవేంద్రరావు రాజకుమారుడు చిత్రంతో పరిచయం చేశాడు. ఈ మూవీ సూపర్ హిట్. మణిశర్మ సాంగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మహేష్ రొమాన్స్ తో పాటు యాక్షన్ ఇరగదీశాడు. 

48
Mahesh Babu

Mahesh Babu

మురారి, ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలతో అతిపెద్ద స్టార్ గా ఎదిగాడు. సుదీర్ఘ కెరీర్లో మహేష్ బాబు పలు రకాల పాత్రలు చేశారు. కాగా మహేష్ బాబు ఓ సందర్భంలో తాను నడిపిన ఫస్ట్ బైక్ ఏంటో తెలియజేశారు. మహేష్ రైడ్ చేసిన ఫస్ట్ బైక్ టీవీఎస్ 50 అట. అప్పటికి మహేష్ వయసు కేవలం 11 ఏళ్ళు అట. 

58

టీనేజ్ కూడా రాకుండానే బైక్ రైడ్ చేశానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మరి స్టార్డం లోనే కాదు సాహసాల్లో కూడా మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపిస్తున్నాడు. 

 

68

మరోవైపు మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం పర్లేదు అనిపించుకుంది. కథ, కథనాల్లో దమ్ము లేకున్నా... మహేష్ మేనియాతో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. నెక్స్ట్ ఆయన రాజమౌళితో చిత్రం చేయనున్నారు. 

78


స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉండగా మే లో మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదట. ఈ విషయాన్ని ఎస్ గోపాల్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఇక జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. హాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ ని తరహాలో ఉంటుందని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. 

 

88

హాలీవుడ్ నటుడు, సాంకేతిక నిపుణులు పని చేయనున్నారట. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం మేకోవర్ అవుతున్నారు. మహేష్ ని సరికొత్తగా చూపించే ప్రయత్నాల్లో రాజమౌళి ఉన్నారట. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved