పెళ్లి పత్రిక పై మహేష్ బాబు ఫోటో, హద్దులు దాటిన అభిమానం, ఎక్కడంటే?
వెర్రి వెయ్యి విధాలు అన్నారు పెద్దలు. స్టార్ హీరోల అభిమానుల విషయంలో కొంత మంది చేసే పనులు అలానే ఉంటున్నాయి. తమ అభిమాన హీరో మీద ప్రేమ ఉండొచ్చుకాని.. అది హద్దులు దాటితేనే వింతగా విచిత్రంగా ఉంటుంది. కొంత మంది ప్యాన్స్ చేసే పనులు కూడా అంతే ఉన్నాయి. తాజాగా ఓ అభిమాని ఏకంగా తన పెళ్లి పత్రిలో హీరో మహేష్ బాబు ఫోటో వేయించి షాక్ ఇచ్చాడు.

ఈమధ్య అభిమానులు చేసే పనులు అంతుపట్టకుండా ఉన్నాయి. తమ ఫేవరేట్ స్టార్ కోసం ఏదో ఒకటి వెరైటీగా చేయాలన్న ఆరాటంలో వింత వింతగా చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే కొంత మంది మాత్రమే ఇలా ఆలోచిస్తున్నారు. డైహార్ట్ ఫ్యాన్స్ అయితే పచ్చబొట్టు పొడిపించుకోవడం, ఫ్యాషన్ ఫాలో అవ్వడం, పాదయాత్రలు చేయడం, విగ్రహాలు పెట్టి గుడి కట్టి పూజించడంలాంటివి చేస్తుంటారు. ఇప్పటికే రజినీకాంత్, సోనూసూద్, ఖుష్బు, నమిత, ఇలా స్టార్స్ చాలామందికి గుడి కట్టి పూజించడం చూశాం.
అంతే కాదు రామ్ చరణ్ అభిమాని అయితే తన పంట పొలంలో చరణ్ ముఖం ఆకారంలో వరి పంట పండించి ఆ ధాన్యాన్ని చరణ్ కు ఇచ్చాడు. ఆఫోటోకు ప్రేమ్ చేయించడంతో పాటు ఆ పండించిన వండ్లతో కూడా రామ్ చరణ్ ఫోటో వచ్చేలా డిజైన్ చేయించి పెట్టాడు. ఇలా తమ అభిమానాన్ని రకరకాల రూపాల్లో చూపించుకుంటుంటారు ఫ్యాన్స్. ఇక తాజాగా ఓ అభిమాని అయితే ఏకంగా తన పెళ్లి పత్రికపై మహేష్ బాబు ఫోటో వేయించి షాక్ ఇచ్చాడు.
కర్నూలు లో ఒక మహేష్ బాబు అభిమాని తన పెళ్లి శుభలేఖ పై మహేష్ బాబు ఫోటోని ముద్రించాడు. దానికి సంబంధించిన ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అయ్యింది. జీవితంలో అతి ముఖ్యమైన సందర్భాలలో ఒకటైన పెళ్లి వేడుకలో అభిమాన హీరో ఫోటో వేసుకోవడం గతంలో కూడా కొంత మంది చేశారు. ఇక ఈ జాబితాలో మహేష్ కూడా చేశారు. అయితే ఈ విషయంలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇదేం పైత్యం అతని కొందరు అంటుంటే.. అభిమానం అంటే ఇలా ఉండాలి అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక పెళ్లి పత్రిక మాత్రం ఫిబ్రవరిలో జరిగిన పెళ్లికి సబంధించింది. ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఫస్ట్ షెడ్యుల్ షూటింగ్ ఒరిస్సాల్ కంప్లీట్ అయ్యింది. . మే మొదటి వారం నుండి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో సుమారుగా నెల రోజుల పాటు ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. మూడు వేల మంది ఆర్టిస్టుల తో భారీ యాక్షన్ సీక్వెన్స్ కు రెడీ అవుతున్నారు. ఈ షెడ్యుల్ లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక, మూవీ టీం భారీ షెడ్యుల్ కోసం ఫారిన్ కి వెళ్లనుంది.