MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిన్ను చాలా మిస్ అవుతున్నా అన్నయ్యా, ప్లీజ్ తిరిగొచ్చేయ్.. గౌతమ్ కోసం సితార ఆవేదన!

నిన్ను చాలా మిస్ అవుతున్నా అన్నయ్యా, ప్లీజ్ తిరిగొచ్చేయ్.. గౌతమ్ కోసం సితార ఆవేదన!

అన్నయ్య గౌతమ్ ని సితార బాగా మిస్ అవుతుంది. తన బాధ తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 28 2023, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Gautham Sitara

Gautham - Sitara

మహేష్ డాటర్ సితార వాళ్ళ అన్నయ్య గౌతమ్ ని చాలా మిస్ అవుతుందట. గౌతమ్ ఇంట్లో లేకపోవడంతో తాను ఒంటరి అయ్యిందట. గౌతమ్ తో ఆడుకున్న హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సితార...'నిన్ను చాలా మిస్ అవుతున్నా అన్నయ్యా, ప్లీజ్ త్వరగా తిరిగి వచ్చేయ్'' అని కామెంట్ పెట్టింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Gautham - Sitara

Gautham - Sitara

సితార పాప పోస్ట్ అన్నయ్యపై ఆమెకున్న అపరిమిత ప్రేమను తెలియజేస్తుంది. గౌతమ్ ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి వరల్డ్ కల్చరల్ టూర్ కి వెళ్ళాడు. తన ట్రిప్ ఇంకా ముగియలేదు. సితార త్వరగా ఇంటికి రావాలని అన్నయ్యను గుర్తు చేసుకుంటుంది. సితార పోస్ట్ వైరల్ గా మారింది. మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

36
Gautham - Sitara

Gautham - Sitara

గౌతమ్ ట్రిప్ పై అమ్మ నమ్రత కూడా ఎమోషనల్ అయ్యారు. ఆమె సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. అందులోనూ గౌతమ్ మొదటిసారి పేరెంట్స్ లేకుండా ఓ ట్రిప్ కి వెళుతున్నాడు. నమ్రత తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో...  గౌతమ్  ఫస్ట్ టైం ఒంటరిగా విదేశాలకు కల్చరల్ ట్రిప్ కి వెళుతున్నాడు. నాలో సగభాగం దూరం అవుతున్న భావన కలుగుతుంది. దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ బాధ గౌతమ్ తిరిగి కళ్ల ముందుకు వచ్చే వరకు తీరదు. మా బుజ్జికన్నకు రెక్కలొచ్చి ఎగిరిపోయాడు. ఈ ట్రిప్ నీకు ఎన్నో అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా... అని నమ్రత చాలా ఎమోషనల్ అయ్యారు. నమ్రత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. 
 

46
Gautham - Sitara

Gautham - Sitara

గౌతమ్ క్లాస్ మేట్స్ తో ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గౌతమ్ వయసు 16 ఏళ్ళు. మహేష్ వారసుడిగా భవిష్యత్ లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరను దున్నేశాడు. ఇక గౌతమ్ వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ చిన్నప్పటి పాత్ర చేశాడు. సితార సర్కారు వారి పాట మూవీ ప్రమోషనల్ సాంగ్ లో నటించింది. 
 

56
Gautham - Sitara

Gautham - Sitara

ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ విరామం దొరికితే విదేశాలకు చెక్కేస్తారు. ప్రపంచంలో ఉన్న అందమైన ప్రదేశాలన్నీ కవర్ చేశారు. కుటుంబంతో పాటు టూర్స్ కి వెళ్లడం మహేష్ కి చాలా సరదా. ప్రతి ఏడాది పలుమార్లు వెకేషన్ ప్లాన్ చేస్తారు. 
 

66
Gautham - Sitara

Gautham - Sitara

ఇక మహేష్ విషయానికి వస్తే....  ఎస్ఎస్ఎంబీ 28(SSMB 28) షూట్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది.

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
Recommended image3
Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved