- Home
- Entertainment
- హీరోగా మహేష్ బాబు అన్నకొడుకు.. గౌతమ్ కంటే ముందే ఎంట్రీ.. భారీగా ఏర్పాట్లు.. కన్ఫమ్ చేసిన తాత
హీరోగా మహేష్ బాబు అన్నకొడుకు.. గౌతమ్ కంటే ముందే ఎంట్రీ.. భారీగా ఏర్పాట్లు.. కన్ఫమ్ చేసిన తాత
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడు. మహేష్ కొడుకు గౌతమ్ కంటే ముందే మరో వారసుడి ఎంట్రీ ఉండనుందట. భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయట.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోలు రాణిస్తున్నారు. మహేష్ బాబు, సుధీర్‌బాబు, గల్లా అశోక్ హీరోలుగా మెప్పిస్తున్నారు. మంజుల భర్త కూడా నటుడిగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో వారసుడు రాబోతున్నాడు. మూడో తరం హీరో ఎంట్రీకి గట్టి ప్లాన్ జరుగుతుంది.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్‌బాబు ప్రారంభంలో హీరోగా నటించారు. `సామ్రాట్` చిత్రంలో హీరోగా మెప్పించారు. `కృష్నగారి అబ్బాయి` చిత్రాల్లో డబుల్ రోల్ చేశారు. కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు రమేష్‌బాబు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరగా ఆయన `ఎన్‌కౌంటర్` చిత్రంలో కీ రోల్ చేశారు. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. సూర్యవంశం (హిందీ), అర్జున్, అతిథి, దూకుడు చిత్రాల ఆయన ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. అంతేకాదు బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న ఆయన అనారోగ్యంతో 2022లో కన్నుమూశారు.
ఇదిలా ఉంటే తన పెద్ద కొడుకు రమేష్ బాబుని నటుడిగా చూడాలనుకున్నారు సూపర్ స్టార్. హీరోగా నిలబడితే బాగుండు అనుకున్నారు. కానీ ఆయన సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఆ వెలితి సూపర్ స్టార్‌లో ఉంది. వారి ఫ్యామిలీ అంతా రమేష్ బాబు విషయంలో ఎంతో బాధపడ్డారు. దీంతో ఇప్పుడు ఆయన కొడుకుపై చాలా బాధ్యతలు ఉన్నాయి. అదే సమయంలో చాలా ప్రెజర్ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో బ్రేకింగ్ లాంటి విషయం బయటకు వచ్చింది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు రమేష్ బాబు కొడుకు. పేరు జయకృష్ణ. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ వర్థంతి, తండ్రి రమేష్ బాబు వర్థంతి సమయాల్లోమెరిశాడు జయకృష్ణ. అందరి దృష్టిని ఆకర్షించాడు. చూడ్డానికి వైట్‌గా భారీ కటౌట్ తో కనిపించాడు. మహేష్ బాబు కంటే హైట్ ఉన్నాడు.
ప్రస్తుతం ఆయన అమెరికాలో ఫిల్మ్ కోర్స్ చేస్తున్నాడట. త్వరలోనే(ఈ జులైలోనే) ఇండియా వస్తాడని, వచ్చే ఏడాది హీరోగా ఎంట్రీ ఉంటుందని ఆయన చిన్న తాత, నిర్మాత ఆదిశేషగిరి రావు వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కూతురు మెల్‌బోర్న్ లో పీజీ చేస్తుందని, ఆమె ఆగస్ట్ లో వస్తుందన్నారు ఆదిశేషగిరిరావు. మొత్తానికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాబోతున్నాడని చెప్పొచ్చు.
Image: Namrata Shirodkar / Instagram
అంతేకాదు మహేష్ బాబు కొడుకు కూడా భవిష్యత్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన స్టడీస్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే కూతురు సితార కూడా ఓ వైపు స్టడీస్ చేస్తూనే డాన్స్ వీడియోలు, సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్స్, యాడ్స్ చేస్తూ స్టార్ అయిపోయింది. ఆమె కూడా తనకు సినిమాల్లోకి రావాలని ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే. వీళ్లు రావడానికి ఇంకా టైమ్ ఉంది. కానీ రమేష్ బాబు కొడుకు ఎంట్రీ మాత్రం వచ్చే ఏడాదినే ఉంటుందని చిన్న తాత చెప్పడం విశేషం.