MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ హ్యాండ్సమ్ స్టార్ మహేష్ బాబు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలుసా..? హీరోగా దీపక్ సరోజ్ ఎంట్రీ

ఈ హ్యాండ్సమ్ స్టార్ మహేష్ బాబు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలుసా..? హీరోగా దీపక్ సరోజ్ ఎంట్రీ

ఈ ఫోటోలో కనిపిస్తున్న యంగ్ హ్యాండ్సమ్ స్టార్ ను గుర్తు పట్టారా..? ఎలా గుర్తు పడతారు.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు కాని.. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు.. ఇంతకీ ఈ యంగ్ హీరో.. ఎసినిమాలో నటించాడు.. ఎవరితను.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 24 2024, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. వారు పెద్దయ్యాక కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మరికొంత మంది మాత్రం హీరోలుగా స్థిరపడుతూ వచ్చారు. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజా సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నవారే. అయితే మరికొంత మంది మాత్రం ఇండస్ట్రీలో నిలబడలేక ఇతర రంగాల్లో స్థిరపడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హ్యాండ్సమ్ స్టార్ కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినవాడే. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించి మెప్పించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే  ఈ కుర్రాడు ఏ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు అని మీకు సందేహం రావచ్చు.. మనోడు మహేష్ బాబు హీరోగా నటించిన  అతడు సినిమా పదేళ్ల కుర్రాడిగా నటించి  మెప్పించాడు. నటించింది రెండు మూడు సీన్లే అయినా.. నవ్వించాడు, మెప్పించాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు.. బ్రహ్మానందం కొడుకు పాత్ర చేసిన పిల్లాడు. నాన్నా ట్రైన్ తెమ్మాన్నాను తెచ్చావా అని బ్రహ్మీని అడుగుతాడు కదా..? అతనే..

36

త్రివిక్రమ్ అతడు సినిమా  ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ అటువంటిది మరి. ఈసినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్. సినిమాలో హీరో ఆ ఫ్యామిలీకి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఇతనే. అతడు సినిమాలో దీపక్ చాలా సీన్స్ లో కనిపిస్తాడు. అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొని పలు సినిమాల్లో నటించాడు. 
 

46

అతడు వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతుంది.. ఇక దీపక్ సరోజ్ పెద్దవాడుఅయ్యాడు.. ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు. ఇన్ స్టాలో ఫోటోలతో అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా రాబోతున్న సినిమా సిద్దార్థ్ రాయ్.

56

రీసెంట్ గా  ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కూడా చేశారు. ఈ ట్రైలర్  లో రప్ అండ్ రగ్డ్ గా కనిపించాడు హ్యాండ్సమ్ స్టార్. ఈమూవీ తీరు చూస్తుంటే  మరో అర్జున్ రెడ్డి అయ్యేలా కనిపిస్తుంది. యూత్ ను ఆకర్షించడానికి పక్కా బోల్డ్, ఎమోషన్ కంటెంట్ తో రాబోతున్నాడు దీపక్. త్వరలోనే సిద్దార్థ్ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నాడు. 
 

66

చూడ్డానికి చాలా బాగున్నాడు దీపక్. మరి యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఈసినిమాతో తాను హీరో మెటీరియల్ అని  నిరూపించుకోగలిగితే.. అతను మరో విజయ్ దేవరకొండ కావడం ఖాయం అంటున్నారు. మరి మనోడు మరి ఈ సినిమాతో హీరోగా కూడా పేరు తెచ్చుకొని  వరుసగా సినిమాలు చేస్తాడో.. లేదో  చూడాలి.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved