- Home
- Entertainment
- బుల్లితెరపై సందడి చేయనున్న మహేశ్ బాబు, సితార.. రియాలిటీ షోలో కనిపించనున్న తండ్రీకూతురు..
బుల్లితెరపై సందడి చేయనున్న మహేశ్ బాబు, సితార.. రియాలిటీ షోలో కనిపించనున్న తండ్రీకూతురు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన కూతురు సితార ఘట్టమనేని మరోసారి అభిమానులను సర్ ప్రైజ్ చేయబోతున్నారు. రియాలిటీ షోలో కలిసి కనువిందు చేయబోతున్నారు. ఈ సందర్భంగా నెట్టింట పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఇటీవల ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తొలుత సినిమా నెగెటివ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ.. తర్వాతి రోజుల్లో టాక్ మారి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
అయితే ఈ చిత్రంలో తొలిసారి ఆయన కూతురు సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni)తో కలిసి కనిపించారు. అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో సితార, మహేశ్ బాబు అభిమానులు, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఈ తండ్రీకూతురు కలిసి అలరించబోతున్నట్టు తెలుస్తోంది.
హిందీ పాపులర్ డాన్స్ రియాలీ షో ‘డాన్స్ ఇండియా డాన్స్’ (Dance India Dance) తెలుగు వెర్షన్ కొద్ది రోజుల్లో ‘జీ 5’ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది. ఈ రియాలిటీ షోకు గెస్ట్ లు గా మహేశ్ బాబు తన కూతురుతో హాజరయ్యారు. తొలిసారిగా బుల్లితెరపై మహేశ్, సితార కనిపించబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం మహేశ్ బాబు, సితారకు షోలో గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నటు వంటి ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబు స్టైలిష్ లుక్ లో దర్శనమివ్వగా.. సితార క్యూట్ లుకింగ్ లో షోలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన చిత్రం ‘వన్ నేనొక్కడినే’లో గౌతమ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. Sarkaru Vaari Paataతో సితార కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
మహేశ్ బాబు కూతురు ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ కిడ్ గా చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇలా మహేశ్ బాబుతో కలిసి మరోసారి కనిపించడంతో సితార క్రేజ్ మరింత పెరగనుంది. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎస్ఎస్ఎంబీ 28’గా చిత్ర రూపుదిద్దుకోనుంది.