- Home
- Entertainment
- సింహాన్ని బంధించిన రాజమౌళి, మహేష్ కామెంట్ మాత్రం హైలైట్..షూటింగ్ పై మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్
సింహాన్ని బంధించిన రాజమౌళి, మహేష్ కామెంట్ మాత్రం హైలైట్..షూటింగ్ పై మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 (వర్కింగ్ టైటిల్) చిత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. అయితే ఎలాంటి డీటెయిల్స్ రాజమౌళి బయటకి రానీయలేదు.

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29( వర్కింగ్ టైటిల్) చిత్రం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. అయితే ఎలాంటి డీటెయిల్స్ రాజమౌళి బయటకి రానీయలేదు. ఈ చిత్రం కోసం ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చారు. రాజమౌళి సినిమా కోసం ఆమె హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ లో పాల్గొన్నారు.
ఆ తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ని సందర్శించారు. మొత్తంగా రాజమౌళి, మహేష్ చిత్రంలో కదలిక వచ్చింది. తాజాగా రాజమౌళి సోషల్ మీడియాలో చేసిన క్రేజీ పోస్ట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. సింహం ఫొటోని రాజమౌళి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి కాప్చర్ అనే కామెంట్ పెట్టారు. ఈ పోస్ట్ లో సింహాన్ని బంధించినట్లుగా చూపించారు. వెంటనే రాజమౌళి పాస్ పోస్ట్ ని చూపిస్తూ చిరునవ్వు నవ్వారు.
ఈ పోస్ట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన కామెంట్ అదిరిపోయింది. ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అనే డైలాగ్ తో మహేష్ బాబు రిప్లై ఇవ్వడం విశేషం. ఇక ప్రియాంక చోప్రా కూడా స్పందించింది. ఫైనల్లీ అంటూ హార్ట్ ఎమోజిలో పోస్ట్ చేసింది. మొత్తంగా మహేష్, రాజమౌళి చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది అనే క్లారిటీ వచ్చేసింది.
రాజమౌళి చేసిన పోస్ట్ పై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు మహేష్ బాబుని రాజమౌళి లాక్ చేసేశారు.. అందుకే సింహాన్ని బంధించినట్లు పోస్ట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సీజ్ ది లయన్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మహేష్ ఇకపై ఫారెన్ టూర్లకు వెళ్లకుండా రాజమౌళి పాస్ పోర్ట్ లాగేసుకున్నారని చెబుతున్నారు.
మహేష్ బాబు, రాజమౌళి చిత్రం అఫిక్రా అడవుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. దీనితో ఈ చిత్ర షూటింగ్ ఆఫ్రికాలో కూడా జరగనుంది. జంతువులకి సంబంధించిన కళ్ళు చెదిరే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయట. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.