- Home
- Entertainment
- Guppedantha Manasu: తమ్ముడి చేసిన పనికి సంతోషిస్తున్న ఫణీంద్ర.. భార్యకి క్షమాపణలు చెప్పిన మహేంద్ర?
Guppedantha Manasu: తమ్ముడి చేసిన పనికి సంతోషిస్తున్న ఫణీంద్ర.. భార్యకి క్షమాపణలు చెప్పిన మహేంద్ర?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భార్య ప్రవర్తనకి కారణం తెలుసుకొని పశ్చాతాపంతో క్షమాపణలు చెప్పిన ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో జగతి చెప్పింది విని ఆవేశంతో రగిలిపోతాడు మహేంద్ర. ఇప్పుడు నువ్వేమీ ఆవేశ పడకు. జరిగిందానికి కారణం తన భార్య కొడుకు అని తెలిస్తే బావగారు తట్టుకోలేరు అంటుంది జగతి. ఇలా ఎంతకాలమని ఎదురు చూస్తాము అంటాడు మహేంద్ర. రిషి వస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి అందుకే అడుగుతున్నాను.
వసుధార ఎక్కడ ఉందో చెప్పు తనకి కచ్చితంగా రిషి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది నేను వెళ్లి తీసుకు వస్తాను అంటుంది జగతి. రిషి ఎక్కడ ఉన్నాడు నాకు తెలుసు అంటాడు మహేంద్ర. ఆ మాటలకి ఆశ్చర్య పోతుంది జగతి తర్వాత సంతోషిస్తూ ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నలు వేస్తుంది. నేను తనతో మాట్లాడలేదు కలవలేదు కానీ తన గొంతు మాత్రం విన్నాను చాలా సంతోషంగా ఉంది.
నేను తనని కలిస్తే అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళిపోతాడో అని భయంతో ఇలా చేశాను. మన కొడుకు నిందలు తొలగిపోయి రాజకుమారుడు లాగా ఇంటికి రావాలి అంటాడు మహేంద్ర. తప్పకుండా వస్తాడు మనమే వెళ్లి తీసుకొద్దాం అంటుంది జగతి. మరోవైపు వసు కి దగ్గరుండి సపర్యలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ నీకు కంఫర్ట్ గానే ఉంది కదా ప్రశాంతంగా పడుకో అంటుంది ఏంజెల్.
ఒక స్మైల్ ఇస్తుంది వసు. ఒక నవ్వుతోనే అందర్నీ పడేస్తావు అని నవ్వుతుంది ఏంజెల్. ఆ తరువాత రిషి దగ్గరికి వచ్చి మన కాలేజీ లెక్చరర్ వసుధానికి యాక్సిడెంట్ అయింది తెలుసు కదా తను ఎలా ఉందో కనుక్కున్నావా అసలు ఎక్కడుందో తెలుసా అని అడుగుతుంది. ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే ఉండి ఉంటుంది అంటాడు రిషి. అప్పుడు తనని వసు రూమ్ కి తీసుకెళ్లి చూపిస్తుంది.
మీ కొలీగ్ కదా తనని అలా వదిలేస్తావా అని రిషి ని అడుగుతుంది ఏంజెల్. తను అలా వదిలేసే రకం కాదు నన్ను ఆయనే హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్ పే చేశారు అంటుంది వసు. ఆ మాటలకి ఆశ్చర్యపోతుంది ఏంజెల్. ఇంత మళ్లీ ఏమీ తెలియని వాడిలాగా ఎలా ఉంటావు. నిజంగా జెంటిల్మెన్ అంటుంది ఏంజెల్. నేను లేనప్పుడు కూడా తనని బాగా చూసుకో అంటుంది ఏంజెల్.
అంత అవసరం రాదేమో అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు మహేంద్ర డల్ గా ఉండడాన్ని చూసి భరించలేక పోతాడు ఫణీంద్ర. ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. కొంచెం తలనొప్పిగా ఉంది అని అన్నకి చెప్పి జగతిని టాబ్లెట్లు అడుగుతాడు. మహేంద్ర జగతితో మాట్లాడటం చూసి తల్లి కొడుకులు షాక్ అయితే ఫణీంద్ర, ధరణి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు.
నీలో వచ్చిన మార్పు కి నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని బ్లెస్ చేస్తాడు ఫణీంద్ర. మరుసటి రోజు పొద్దున్నే చక్రపాణి కూతురికి ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటాడు. మహేంద్ర వచ్చిన సంగతి తను మహేంద్ర తో మాట్లాడిన మాటలు అన్ని కూతురికి చెప్తాడు. అలా ఎందుకు చేసావు మళ్ళీ రిషి సర్ కి తెలిసిందంటే నేనే చెప్పాననుకుంటారు అంటుంది వసు.
మహేంద్ర సర్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను ఆయనకి అన్ని అర్థమయ్యేలాగా చెప్పాను అంటాడు చక్రపాణి. సరే అని ఫోన్ పెట్టేస్తుంది వసు. ఈ లోపు రిషి వసుని పలకరిద్దాం అనుకొని వస్తాడు. అంతలోనే మళ్లీ అంత అవసరం లేదు అనుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. సేమ్ కట్ చేస్తే జగతి పట్ల తన ప్రవర్తనకి సిగ్గుపడతాడు మహేంద్ర పశ్చాతాపంతో భార్యకి క్షమాపణలు చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.