- Home
- Entertainment
- షారుఖ్, దీపికాపై పెరుగుతున్న ట్రోలింగ్.. అసభ్యకరమైన సీన్లపై మంత్రి వార్నింగ్, సినిమానే తొలగిస్తాం
షారుఖ్, దీపికాపై పెరుగుతున్న ట్రోలింగ్.. అసభ్యకరమైన సీన్లపై మంత్రి వార్నింగ్, సినిమానే తొలగిస్తాం
ఇటీవల బాలీవుడ్ చిత్రాలపై ఎక్కువగా బాయ్ కాట్ ట్రెండ్ జరుగుతోంది. షారుఖ్ ఖాన్ చిత్రాలు కూడా అందుకు అతీతం కాదు. షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ చిత్రం జనవరి 25న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇటీవల బాలీవుడ్ చిత్రాలపై ఎక్కువగా బాయ్ కాట్ ట్రెండ్ జరుగుతోంది. షారుఖ్ ఖాన్ చిత్రాలు కూడా అందుకు అతీతం కాదు. షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ చిత్రం జనవరి 25న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు.
షారుఖ్ ఖాన్ చాలా రోజుల తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో రచ్చ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. షారుఖ్ కి జోడిగా ఈ చిత్రంలో దీపికా పదుకొనె నటిస్తోంది. షారుఖ్ ఖాన్ సిక్స్ ప్యాక్ లుక్ , దీపికా హద్దుల్లేని గ్లామర్ షో ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారుతోంది.
ఇటీవల ఈ చిత్రం నుంచి భేషరమ్ అనే సాంగ్ విడుదలయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సాంగ్ లో దీపికా పదుకొనె బికినీ అందాలతో మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో 35 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ కారణంగానే పఠాన్ చిత్రం వివాదంలో చిక్కుకుంది.
దీపికా పదుకొనె శృతి మించే విధంగా బికినీ అందాలు ఆరబోస్తూ డ్యాన్స్ చేయడం కొందరికి నచ్చడం లేదు. మరీ ఇంత అతిగా గ్లామర్ షో అవసరమా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఈ సాంగ్ లో షారుఖ్.. దీపికాని చూడడానికి అసభ్యకరంగా అనిపించే చోట టచ్ చేయడం మరో వివాదంగా మారింది. ఈ వివాదం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పఠాన్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ అప్పుడే నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
తాజాగా మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా 'పఠాన్' చిత్రం పై సంచలన వ్యాఖలు చేశారు. ఈ చిత్రంలో అసభ్యకరమైన సన్నివేశాలు తొలగించకుంటే సినిమానే తొలగించాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చారు. భేషరమ్ సాంగ్ లో దీపికా కాషాయం వస్త్రాలు ధరించి అసభ్యంగా కనిపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ చిత్రంలో కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి. వాటిని మార్చకుంటే సినిమాని బ్యాన్ చేస్తాం అంటూ నరోత్తమ్ మిశ్రా సోషల్ మీడియాలో తెలిపారు. అలాగే దీపికా వివాహం తర్వాత ఇలా శృతి మించి రొమాన్స్ చేయడం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.