- Home
- Entertainment
- చిరంజీవి, వెంకీ, నాగ్ కాదు.. బాలయ్యతో రొమాన్స్ కి ఒప్పుకున్న మాధురి దీక్షిత్, ఎందుకో తెలుసా ?
చిరంజీవి, వెంకీ, నాగ్ కాదు.. బాలయ్యతో రొమాన్స్ కి ఒప్పుకున్న మాధురి దీక్షిత్, ఎందుకో తెలుసా ?
ప్రస్తుతం కొంత మంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించేందుకు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమాకి ప్రస్తుతం ప్రపంచ స్థాయి వచ్చింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా బాక్సాఫీస్ గేమ్ మారిపోయింది.ఇండియన్ సినిమాలో మాధురి దీక్షిత్ గురించి సినీ అభిమానులకు పరిచయం అవసరం లేదు.

Madhuri Dixit, Nandamuri Balakrishna
ప్రస్తుతం కొంత మంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించేందుకు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమాకి ప్రస్తుతం ప్రపంచ స్థాయి వచ్చింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా బాక్సాఫీస్ గేమ్ మారిపోయింది. గతంలో కొందరు బాలీవుడ్ హీరోయిన్లు వారికి క్రేజ్ రాకముందు తెలుగులో నటించి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయారు.
Nandamuri Balakrishna
ఇండియన్ సినిమాలో మాధురి దీక్షిత్ గురించి సినీ అభిమానులకు పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ప్రేక్షకులని తన గ్లామర్ తో ఉర్రూతలూగించిన బ్యూటీ క్వీన్ ఆమె. ఏక్ దో తీన్ అంటూ గ్లామర్ మ్యాజిక్ చేసింది. బాలీవుడ్ లో చాలా కాలం పాటు మాధురి దీక్షిత్ నంబర్ 1 హీరోయిన్ గా రాణించింది. ఆమె నంబర్ 1 గా రాణిస్తున్న సమయంలో చాలా మంది తెలుగు నిర్మాతలు టాలీవుడ్ చిత్రాల్లో మాధురిని నటింపజేయడానికి చాలా ప్రయత్నించారు.
Nandamuri Balakrishna
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో మాధురిని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ మాధురి తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపలేదు. కానీ బాలయ్యతో మాత్రం రొమాన్స్ చేసేందుకు అంగీకరించింది. అదేంటి చిరంజీవి లాంటి వారిని కూడా రిజెక్ట్ చేసి బాలయ్యకి ఎందుకు ఒకే చెప్పింది అని అనుకుంటున్నారా ? అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. బాలకృష్ణ, మాధురి దీక్షిత్ కాంబినేషన్ సెట్ చేసింది ఎవరో ఎవరో కాదు అగ్ర నిర్మాత ఏఎం రత్నం.
అప్పట్లో ఏఎం రత్నం తెలుగు, హిందీ భాషల్లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. తేజాబ్ లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్ చంద్ర అనే దర్శకుడిని ఎంచుకున్నారు. అప్పట్లో బాలయ్య రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రంతో మంచి జోష్ లో ఉన్నారు. దీనితో ఏఎం రత్నం బాలయ్యని అప్రోచ్ అయ్యారు. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ద్విభాషా చిత్రం కాబట్టి ఏకంగా 6 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం.
హీరో, నిర్మాత, దర్శకుడు అంతా సెట్ అయ్యారు. ఇక హీరోయిన్ కూడా అదే రేంజ్ లో ఉండాలని ఏఎం రత్నం అనుకున్నారు. అప్పట్లో మాధురి దీక్షిత్ నంబర్ 1 హీరోయిన్ కాబట్టి ఆమెనే ఒప్పించాలని అనుకున్నారు. కానీ మాధురి తెలుగు హీరోలతో సినిమా చేయదు అని తెలుసు. దీనితో దర్శకుడు ఎన్ చంద్రని అడగమని చెప్పారట.
తనకి తేజాబ్ లాంటి చిత్రంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తీసుకొచ్చిన ఎన్ చంద్ర అంటే మాధురి దీక్షిత్ కి గౌరవం. ఆయన అడిగిన వెంటనే బాలయ్య చిత్రానికి మాధురి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథ చర్చల కోసం నాలుగైదు సిట్టింగ్స్ కూడా జరిగాయట. ఆ కథని భారీ స్థాయిలో తీయాలి కాబట్టి బడ్జెట్ ఇంకా ఎక్కువ అవుతుంది అని అంచనాకి వచ్చారు. బడ్జెట్ సెట్ కాకపోవడంతో ఎన్ చంద్ర కొత్త చిత్రాలతో బిజీ అయ్యారు. ఏఎం రత్నం బడ్జెట్ సెట్ చేసుకునే టైంకి బాలయ్య కూడా బిజీ అయిపోయారు. క్రమంగా ఆ చిత్రం అటకెక్కింది. ఆ విధంగా బాలయ్య, మాధురి దీక్షిత్ కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కాకుండానే ఆగిపోయింది.