వైరల్: యంగ్ హీరోతో మాధురీ దీక్షిత్ రొమాంటిక్ డాన్స్
మాధురీ దీక్షిత్ అంటే వెండితెర మాయాజాలం. ఒక దశలో ఆమె మీద మనసు పారేసుకోని భారతీయ ప్రేక్షకుడు ఉండడు అంటూ అతిషయోక్తి కాదేమో. ఈ బ్యూటీ ఈ జనరేషన్ రొమాంటిక్ సెన్సేషన్ ఇమ్రాన్ హష్మీతోనూ హాట్ హాట్ సీన్లలో నటించి అలరించింది. తాజాగా లాక్ డౌన్ సందర్భంగా ఖాళీగా ఉన్న అభిమానులు మరోసారి ఆ వీడియోను వైరల్ చేశారు.
ఓ రియాలిటీ షోలో పాల్గొన్న మాధురీ దీక్షిత్ డాన్స్ ఫ్లోర్ మీద రొమాంటిక్ సాంగ్‌తో సందడి చేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రేక్షకులంతా ఆమె నడుమొంపులు చూస్తూ మంత్రముగ్దులయ్యారు. ట్రాన్స్‌పరెంట్ ఎల్లో శారీలో మాధురి అందాలు వావ్ అనిపించాయి.
ఇమ్రాన్ హష్మీతో కలిసి మాధురి చేసిన రొమాంటిక్ సాంగ్ లాక్ డౌన్ సమయంలో మరోసారి వైరల్ అయ్యింది.
ఈ పాటలో ఇమ్రాన్ హష్మీ, మాధురీ దీక్షిత్‌ల కెమిస్ట్రీ చూసి అక్కడి వచ్చిన వార్తంతా షాక్ అయ్యారు. దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మాధురి సిగ్గు పడటం, ఇమ్రాన్ నవ్వుతూ ఆమె దగ్గర తీసుకోవటం ఇలాంటి మూమెంట్స్‌తో స్టేజ్ మీద సెగలు పుట్టించారు ఈ జంట.
ఈ డాన్స్ షోతో మాధురీ దీక్షిత్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎల్లో శారీలో మాధురి కుర్ర హీరోయిన్లకు పోటి ఇచ్చే గ్లామర్, ఎక్స్‌ప్రెషన్స్‌తో రెచ్చిపోయింది. ఇమ్రాన్ కూడా డీసెంట్ లుక్‌లో అదరగొట్టాడు.
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమాలోని సూపర్ హిట్ పాటలో సినిమాలో ప్రాచీ దేశాయ్ నటించింది.
రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాధురీ, ఇమ్రాన్ అధరగొట్టిన ఈ పాట ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది.
90లలో ఏ గ్రేస్‌లో డ్యాన్స్ చేసింది ఇప్పుడు కూడా అదే గ్రేస్ తో స్టేజ్ మీద ఇరగ దీసింది ధక్ ధక్ గర్ల్ మాధురీ.
మాధురీ దీక్షిత్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. గత ఏడాది కలంఖ్, టోటల్ ధమాల్ సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వటంతో పాటు పలు రియాలిటీ షోలో గెస్ట్ గా అలరించింది.