రష్మిక డీప్ ఫేక్ వీడియోపై మాధవీలత సంచలనం.. ఆమె వేసుకునే డ్రెస్ కంటే అసభ్యంగా ఏమీ లేదు, పచ్చిగా కామెంట్స్
తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నటి మాధవీలత రష్మిక డీప్ ఫేక్ వీడియోపై పెను సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్మిక సినిమాల్లో, ఈవెంట్స్ లో వేసుకునే డ్రెస్ ల కంటే వల్గర్ గా ఏమిలేదు అంటూ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రష్మిక మందన పేరు జాతీయ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది. రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో బాధితురాలిగా మారిన సంగతి తెలిసిందే. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కొందరు సెలెబ్రిటీలని టార్గెట్ చేస్తున్నారు. వారి ముఖాలన్ని మార్ఫింగ్ చేస్తూ వీడియోలు సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలో రష్మిక మందన ముందుగా బలైంది. రష్మిక పేస్ ని ఇంకొకరికి టెక్నాలజీ ద్వారా ఫేక్ చేసి వీడియో ఇంటర్నెట్ లో వదిలారు. దీనితో దేశవ్యాప్తంగా రష్మికకి మద్దతు లభిస్తోంది. టెక్నాలజీని ఇలాంటి చెత్త పనులకు కాకుండా ఉపయోగపడేందుకు వినియోగించాలని అంతా విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా.. ఇతర మహిళలు, సెలెబ్రిటీలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమితాబ్, నాగ చైతన్య, కీర్తి సురేష్, కేటీఆర్ ఇలా సినీ రాజకీయ ప్రముఖులంతా ఖండిస్తున్నారు.
అంతే కాదు మహిళలు, సెలెబ్రిటీలు ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నటి మాధవీలత రష్మిక డీప్ ఫేక్ వీడియోపై పెను సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతా ఒకలా స్పందిస్తుంటే.. మాధవీలత మరోలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
రష్మిక డీప్ ఫేక్ వీడియోపై మాధవీలత స్పందిస్తూ పచ్చిగా కామెంట్స్ చేసింది. రష్మిక ఫేమ్ ని మరో అమ్మాయి బాడీకి అటాచ్ చేశారు. అయితే ఆ వీడియోలో అంత సభ్యంగా ఏమిలేదు. రష్మిక సినిమాల్లో, ఈవెంట్స్ లో వేసుకునే డ్రెస్ ల కంటే వల్గర్ గా ఏమిలేదు. కాకపోతే సైజులో తేడా అంతే అంటూ మాధవీలత పచ్చిగా వ్యాఖ్యలు చేసింది.
మాధవీలత ఇంకా మాట్లాడుతూ.. కాకపోతే స్టార్ హీరోయిన్లు ఎప్పుడైతే ఒక ఇష్యూని రైజ్ చేస్తారో అది పెద్ద డిబేట్ టాపిక్ గా మారిపోతుంది. కాబట్టి రష్మిక డీప్ ఫేక్ వీడియోపై అన్ని వర్గాల వారు స్పందిస్తూ ఖండిస్తున్నారు. జర్నలిస్టులు కూడా రష్మికకి మద్దతు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. అది చూసి నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడు రష్మికకి మద్దతు తెలుపుతున్న వారంతా సామాన్య ఆడపిల్లలు, మహిళల భద్రతకు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు అనేది ప్రశ్న ?
మీరు అండగా నిలబడాల్సింది రష్మిక లాంటి వాళ్లకు కాదు. సామాన్యులకు అని మాధవీలత పేర్కొంది. ఎందుకంటే అప్పట్లో సావిత్రి గారు, ఇప్పుడు సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఏమీ కాదు వీళ్లంతా. పైగా ఆ వీడియోలో ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ అంత అసభ్యంగా ఏమి లేదు. అది స్విమ్ సూట్ అలాగే ఉంటుంది అంటూ మాధవీలత వివాదాస్పద రెస్పాన్స్ ఇచ్చింది.