- Home
- Entertainment
- Devatha: రుక్మిణి చెంప పగలగొట్టిన దేవుడమ్మ.. రాధ కోసం మరో ప్లాన్ సిద్ధం చేసిన మాధవ్!
Devatha: రుక్మిణి చెంప పగలగొట్టిన దేవుడమ్మ.. రాధ కోసం మరో ప్లాన్ సిద్ధం చేసిన మాధవ్!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 8వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మాధవకు సత్య ఫోన్ చేస్తుంది.. దేవి ఏంటి ఏవేవో చెబుతుంది.. మీరు దేవి తండ్రి కాదు అని తండ్రి కోసం వెతుకుతుంది అని చేబుతుంది అంటే దేవి ఎందుకు అలా చెబుతుంది? రాధ, ఆదిత్యనే ఆలా చెబుతున్నారు.. వాళ్లకు నేను అడ్డు ఉండకూడదు అని ఆలా చెబుతున్నారేమో అంటూ నమ్మిస్తాడు.. ప్లీజ్ సత్య నా కాపురాన్ని నిలబెట్టు.. ఈరోజు ఆ మాట చెప్పింది అంటే రేపు మాధవ్ నా భర్త కాదు అని రాధ కూడా చెబుతుంది ఏమో.. ప్లీజ్ సత్య నా జీవితాన్ని కాపాడు అంటూ మాధవ్ దొంగ ఏడుపు ఏడుస్తాడు.
మరి సీన్ లో రాధకు ఆదిత్య ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతాడు. దేవికి నిజం తెలిస్తే మనం ఇద్దర గురించి ఏం అనుకుంటుంది అంటూ ఫీల్ అవుతాడు.. నిజం తెలిస్తే తెలియని మంచిదే అలా తెలిసిన కూడా అని అంటుంది. దేవి ఇంటికి వస్తుంది.. మీకు దగ్గర అవుతుంది అని రాధ అంటే ఆదిత్య నీ గురించి చెప్పావు ఏంటి రాధ అని అంటే ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు రాధ మేడలో తాళి కట్టాలి.. నా ఇంటి పేరు రాధ ఇంటి పేరు చెయ్యాలి అని అనుకుంటాడు. మరో సీన్ లో దేవుడమ్మ రుక్మిణి ఫోటో చూపించి ఎక్కడైనా చూసావా అని అడిగిన కూడా చూడలేదు అని దేవి చెబుతుంది.
మీ కోడలు కనిపిస్తే ఎం చేస్తావ్ అంటూ మళ్లీ ప్రశ్నిస్తుంది దేవి.. ఏం చేస్తాను ఇంటికి తీసుకెళ్తాను అంటే ఇంట్లో సత్య పిన్నికి బాధ కదా అని అంటుంది. వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకున్నారు అలాంటి వారు ఎందుకు బాధ పడుతారు అంటూ దేవుడమ్మ చెబుతుంది. అయినా ఊర్లో అందరికి న్యాయం చెప్పే దేవుడమ్మ కోడళ్ళకు అన్యాయం చేస్తుందా అని అడిగితే నీ కోడలు ఎవరో నాకు తెలుసు అని దేవి అంటుంది. దేవుడమ్మ షాక్ అవుతుంది... నీకు ఎలా తెలుసు అంటే మా అమ్మనే రుక్మిణి అని అంటుంది. నీ పెద్ద కోడలి బిడ్డను అని చెబుతుంది.
సీన్ కట్ చేస్తే రుక్మిణి జానకమ్మకు, రామ్మూర్తికి సేవలు చేస్తుంటుంది. అక్కడికి దేవుడమ్మ వస్తుంది.. అక్కడ రాధను చూసి దేవుడమ్మ షాక్ అవుతుంది. రుక్మిణి దగ్గరకు వచ్చి దేవుడమ్మ చెంప దెబ్బ కొడుతుంది. చావకుండా చచ్చాను అని చెప్పి ప్రతిరోజు నన్ను చచ్చేలా చేసి ఇక్కడ బతుకుతున్నావా అని అడుగుతుంది. అప్పుడు రామ్మూర్తి రాధ గురించి తెలియక మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఏం తెలియాలి నన్ను నా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయి ఇక్కడ ఎవరికో భార్యగా బ్రతుకుతుంది అంటూ తిడుతుంది.
ఇంకొకరిని పెళ్లి చేసుకొని నన్ను వాళ్ళని అందరిని మోసం చేసింది అంటూ దేవుడమ్మ ఫైర్ అవుతుంది. కట్ చేస్తే దేవుడమ్మ రుక్మిణిని కలుసుకునే సీన్ అంతా కూడా దేవి కన్నా కల.. ఇప్పుడు నేను చెప్తే అమ్మ దేవుడమ్మ అవ్వకు దూరం అవుతుంది అని దేవి అనుకుంటుంది. అన్ని ప్రశ్నలు వేసి సైలెంట్ ఉన్నావు ఏంటి అని అడుగుతుంది. ఎం లేదు కారు ఆపమను నేను ఇంటికి వెళ్తానంటూ దేవుడమ్మకు ముద్దు పెట్టి వెళ్తుంది. ఆ పనితో దేవుడమ్మ తెగ సంబరపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.