- Home
- Entertainment
- Devatha: ప్లాన్ ప్రకారం దేవి పచ్చబొట్టు పొడిపించుకున్న మాధవ.. రాధపై మండిపడ్డ జానకి!
Devatha: ప్లాన్ ప్రకారం దేవి పచ్చబొట్టు పొడిపించుకున్న మాధవ.. రాధపై మండిపడ్డ జానకి!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 22వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో దేవి(devi), మాధవ కనిపించలేదు అని ఆదిత్యకు చెప్పుకొని బాగా ఎమోషనల్ అవుతుంది. దేవి ఏడుపును చూసి తట్టుకోలేక పోయిన ఆదిత్య (adithya)ఎలా అయినా మాధవను వెతికి తీసుకు వస్తాను అని మాట ఇస్తాడు. అందుకు దేవి సరే అని లోపలి కి వెళ్ళి పోగా ఆదిత్య మాత్రం బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు రామ్మూర్తి ఇంట్లో మాధవ గురించి రాధ తప్ప అందరూ బాధ పడుతూ ఉంటారు.
పిల్లలిద్దరూ బాగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు రాధ(radha) ఆలోచిస్తూ ఏదో ప్లాన్ వేసి కావాలనే ఇంట్లో నుంచి వెళ్ళాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రాధ పిల్లలను భోజనం చేయమని అనగా వెంటనే జానకి(janaki) రాధ పై కోప్పడుతుంది. మరోపక్క ఆదిత్య కూడా దేవి మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.
మాధవ ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఫాదర్స్ డే సందర్భంగా స్కూల్ లో వేడుకలు జరుగుతూ ఉండగా ఆ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఆదిత్య(adithya)వస్తాడు. ఇక స్కూల్ దగ్గర రాధా కనిపించడంతో ఆదిత్య రాధతో మాట్లాడగా అప్పుడు రాధ(radha) మాధవ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
దేవీ (devi)చాలా బాధపడుతుంది అని చెప్పగా అప్పుడు ఆదిత్య బాధపడుతూ నువ్వేం బాధపడకు అని రాధక్యా ధైర్యం చెబుతాడు. ఎలా అయినా దేవికి నేనే కన్నతండ్రి అన్న విషయాన్ని చెప్పేస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఆదిత్య లోపలికి వెళ్లగానే అక్కడ దీన్ని చూసి ఆదిత్య(adithya) బాధపడుతూ ఉంటాడు. తన కూతురిని మాధవ దగ్గర చేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటాడు.
ఇక స్కూల్లో ఫాదర్స్ డే ఫంక్షన్ మొదలవుతుంది. అప్పుడు పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి తమ తల్లిదండ్రుల గురించి చెబుతూ ఉంటారు. ఆ తర్వాత దేవి(Devi)కూడా తన తండ్రి గురించి చెబుతూ తన తండ్రి ఎక్కడికి వెళ్లి పోయాడు నాన్న నాన్న అని పిలుస్తూ ఉండగా అప్పుడే మాధవ(madhava)ఎంట్రీ ఇస్తాడు. మాధవ ఎంట్రీ ఇవ్వడంతో రాధ చూసి ఒక్క సారిగా షాక్ అవుతుంది. అప్పుడు దేవి వెళ్లి మాధవ ని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత వేదికపైకి మాధవ(Madhava)ని తీసుకుని వెళ్లి మాధవ కు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇస్తుంది. అప్పుడు మాధవ కూడా దేవి (devi)అన్న పేరును పచ్చబొట్టు పొడిపించుకుని రాధ ఆదిత్య లకు ఒక్కసారిగా షాక్ ఇస్తాడు. తరవాత ఎపిసోడ్లో తన ఫ్యామిలీ అంటూ పిల్లలతో రాధా తో కలిసి అందరికీ చూపిస్తాడు మాధవ.