- Home
- Entertainment
- Prema Entha madhuram: అను లైఫ్ తో ఆడుకుంటున్న మదన్.. పెద్ద ప్రమాదంలో కూరుకుపోతున్న ఆర్య!
Prema Entha madhuram: అను లైఫ్ తో ఆడుకుంటున్న మదన్.. పెద్ద ప్రమాదంలో కూరుకుపోతున్న ఆర్య!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తమ్ముడి ప్రాణాలను రక్షించడం కోసం తన ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుంటున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను కూడా మీతో పాటు లాయర్ దగ్గరికి వస్తాను అని అంజలితో అంటుంది అను. సరే అని అంజలి అనగా ఈరోజు మా ఫ్రెండ్స్ ని లంచ్ కి రమ్మన్నాను నువ్వు భోజనం వండిన తర్వాతే బయలుదేరాలి అని అప్పుతో అంటాడు మదన్. ప్లీజ్ సర్ నేను వెళ్తాను అని అను ఎంత బతిమిలాడినా సరే ఒప్పుకోడు. పని అయిన తర్వాత రా అప్పు పర్లేదు అని చెప్పి అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆర్య పోలీస్ స్టేషన్లో ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి మీకు ఎవరో ఫోన్ చేశారు సార్ అని అంటాడు.
ఫోన్ ఎత్తిన ఆర్యతో ఒక ఆవిడ మాట్లాడుతూ బిజినెస్ టైకూన్ ఆర్య వర్ధన్ గారు తమ్ముడు కోసం త్యాగం చేసి జైల్లో పడ్డారు. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విషయం తెలిస్తే మీ గుండె ముక్కలైపోతుంది. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 14 కంపెనీలు నాశనమైపోతున్నాయి. మీ మీద పగతో నేను ఎలాగైనా నా కక్ష తీర్చుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆవిడ. నేను ఎలాగైనా ఆ కంపెనీలను కాపాడాలి.
ఈ సమస్య నుంచి బయటపడాలి అని మనసులో అనుకుంటాడు ఆర్య. మరోవైపు అను వంటకాలు అన్ని చేసి టేబుల్ మీద పెట్టగా మదన్ ఒక వంటకం మీద ఏదో స్ప్రే జల్లుతాడు. అది వాసన పీల్చిన అనుకి కళ్ళు తిరుగుతాయి. నేను బయలుదేరుతాను సార్ అని అంటూ వెళ్తూ కళ్ళు తిరిగి సోఫా మీద పడుతుంది. ఇంతలో అక్కడున్న పనిమనిషి అనుకి మంచినీళ్లు ఇస్తుంది. బీపీ తక్కువైనట్టు ఉంది ప్రెగ్నెంట్ కదా అని మదన్ అంటాడు. నేను బయలుదేరాలి అని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను. హమ్మయ్య నామీద అనుమానం రాలేనట్టు ఉన్నది అని అనుకుంటాడు మదన్.
మరోవైపు ఇద్దరు కానిస్టేబుల్స్ ఆర్య తో మిమ్మల్ని ఇంకో జైలుకు షిఫ్ట్ చేస్తున్నాం సర్ అని అంటారు. సరైన ఆర్డర్స్ లేకుండా ఇలా జైలుకి షిఫ్ట్ చేయకూడదు నిజం చెప్పండి అని ఆర్య అనగా వాళ్లు తెల్ల మొఖాలు వేసి మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చాయి సార్ అని అంటారు. పైనుంచి ఆర్డర్లు వస్తే పద్ధతి ఇలాగ ఉండదు. మీకు ఇంకెక్కడి నుంచో ఆర్డర్లు వచ్చాయి నేను కోర్టుకు మాత్రమే వస్తాను ఇంకెక్కడికి రాను అని అంటాడు ఆర్య. మరోవైపు అంజలి, నీరజ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆర్య వర్ధన్ కి బెయిల్ ఇప్పించాము బయటికి రప్పించండి అని అంటారు. ఇది నాన్ బెయిల్ కేస్ ఇప్పుడే కొత్త పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నాము.
తను నిరపరాధి అని కోర్టులో తెలిసే వరకు ఎక్కడికి వదలకూడదు అని అంటాడు ఎస్సై. కనీసం ఒకసారి దాదాని చూసి వస్తాము అని నీరజ్ అనగా కుదరదు అని బలవంతంగా బయటికి పంపిస్తారు పోలీసులు. అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐకి అదే అనామకురాలు ఫోన్ చేసి, ఆర్య వర్ధన్ని నేను చెప్పిన చోటికి తీసుకురాకపోతే నీకు కూతురు ఉండదు. కేవలం కొడుకు మాత్రమే మిగులుతాడు జాగ్రత్త. ఆర్య వర్ధన్ని తీసుకొని వస్తే నా గన్ లో బుల్లెట్లు అతని గుండెల్లో గుచ్చుకోవడానికి ఎదురుచూస్తున్నాయి ఈ స్థానంలో నీ కూతురు ఉండకుండా చూసుకో అని ఫోన్ పెట్టేస్తుంది. మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి ఏదో ఒక మాయమాటలు చెప్పండి.
ఆయన్ని ఇంకో జైలుకు షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి బయటకు తీసుకువెళ్లాలి అని ఎస్ఐ కానిస్టేబుల్స్ తో అంటాడు. మరోవైపు అను కంగారుగా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి మా ఆయన ఎక్కడ సార్ అని అంటుంది ఎవరు మీ ఆయన అని అనగా ఆర్య వర్ధన్ అని అంటుంది అను. ఎందుకు ఆయనని చూడడానికి ఇంత మంది వస్తున్నారు. ఆయన్ని కొద్ది సేపటిలో ఇంకొక జైలుకి షిఫ్ట్ చేస్తున్నాము చూడ్డానికి పర్మిషన్ లేదు అని అంటాడు ఎస్సై. ప్లీజ్ సర్ ఆయన భార్యగా అడుగుతున్నాను దయచేసి అతన్ని చూపించండి అని అను వేడుకుంటుంది.తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.