విశాల్ `మద గజరాజా` 3 రోజుల కలెక్షన్లు.. ఇదే జోరు కొనసాగితే నిర్మాతల పంట పండినట్టే
విశాల్ హీరోగా రూపొంది 12 ఏళ్ల తర్వాత విడుదలైన `మద గజరాజా` సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంతానం కామెడీ సినిమాకి పెద్ద బలం. దీంతో సినిమా భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది.
మద గజరాజా
2013లో సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటించిన సినిమా `మద గజరాజా`. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్, సంతానం, నితిన్ సత్య, సత్యగోపన్ రమేష్, సోనూ సూద్ వంటి నటులు నటించారు. అనేక అవాంతరాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి విడుదలైంది.
మద గజరాజా
12 ఏళ్ల తర్వాత జనవరి 12న సినిమా విడుదలైంది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తున్నారు. కామెడీ సినిమాలో హైలైట్‌గా నిలిచింది. విశాల్, అంజలి, వరలక్ష్మి గ్లామర్ కూడా తోడయ్యింది. అందుకే ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రిలీజ్‌కి నోచుకోని ఈ మూవీకి ఇప్పుడు ఆడియెన్స్ ఆదరణ ఆశ్చర్యపరుస్తుంది.
read more: బాలకృష్ణ వంద కోట్ల సినిమాలు ఎన్నో తెలుసా? సీనియర్ హీరోల్లో బాలయ్య రేర్ ఫీట్
మద గజరాజా వసూళ్లు
సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ సంతానం. సినిమా మొత్తం సంతానం హైలైట్. మనోబాల, మొట్ట రాజేంద్రన్ అందరూ బాగా నటించారు. సుందర్ సి సినిమా అంటే నవ్వులే. ఈ సినిమా మళ్ళీ నిరూపించింది.
read more: `సంక్రాంతికి వస్తున్నాం` మొదటి రోజు కలెక్షన్లు, వెంకటేష్ సంచలనం, విక్టరీ ఈజ్ బ్యాక్?
మద గజరాజా వసూళ్లు
`మద గజరాజా` మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలిసింది. మొదటి రెండు రోజుల్లో 6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, మూడో రోజు కూడా 6 కోట్లు వసూలు చేసింది. మొత్తం 12.5 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం మూవీకి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఇది మున్ముందు యాభై కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు.
మధ గజరాజా వసూళ్లు
బాల దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన వణంగాన్ 4 కోట్లు వసూలు చేసింది. విష్ణువర్ధన్ నేసిప్పాయ, జయం రవి `కదలిక్క నేరమిల్లై సినిమాలు కూడా అంతంత మాత్రంగానే వసూలు చేశాయి. దాంతో మద గజరాజా సంక్రాంతి విన్నర్ అయింది. ఇక ఈ మూవీ సుమారు రూ.15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ లెక్కన మూవీ లాంగ్ రన్‌లో నిర్మాతలు బడ్జెట్, వడ్డీలు అన్నీ తీరి లాభాల పంట పండించినా ఆశ్చర్యం లేదు.
read more: మీనా చేయాల్సిన కమల్ `క్షత్రియ పుత్రుడు` ఆఫర్ ఎలా మిస్ అయ్యింది? తెరవెనుక ఏం జరిగింది?
also read: డైరెక్ట్ ఓటీటీలోకి నయనతార మూవీ ? ఆ సినిమా ఏంటో తెలుసా?