- Home
- Entertainment
- `మద గజ రాజా` కలెక్షన్లలో ఊహించని చంప్, విశాల్ సుడి తిరిగినట్టే, ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
`మద గజ రాజా` కలెక్షన్లలో ఊహించని చంప్, విశాల్ సుడి తిరిగినట్టే, ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటించిన `మద గజ రాజా`సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. విశాల్‌కి ఊహించని సక్సెస్‌ని తెచ్చిపెట్టింది. కలెక్షన్లలో జంప్ ఆశ్చర్యపరుస్తుంది.

మద గజ రాజా
సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటించిన `మద గజ రాజా` సినిమా 2013లోనే నిర్మాణం పూర్తయింది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కాలేదు. ఆ తర్వాత విశాల్, సుందర్ సి కాంబినేషన్‌లో `ఆంబళ`, `యాక్షన్` సినిమాలు వచ్చాయి. 12 ఏళ్ల తర్వాత 2025లో `మద గజ రాజా` విడుదలైంది.
అజిత్ `విడముయర్చి` సినిమా పొంగల్ రేసు నుండి తప్పుకోవడంతో `మద గజరాజా` విడుదలైంది. ఇంతకు ముందు చాలా సార్లు విడుదల తేదీ ప్రకటించి వాయిదా వేశారు. ఈసారి కూడా అదే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని చిత్ర బృందం చెప్పడంతో అభిమానులకు నమ్మకం కుదిరింది.
read more: `ఆదిత్య 369` షూటింగ్‌లో నడుము విరగొట్టుకున్న బాలయ్య, కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
మధగజరాజా కలెక్షన్స్
జనవరి 12న విడుదలైన `మద గజ రాజా` సినిమాలో సంతానం కామెడీ, విశాల్ యాక్షన్, అంజలి, వరలక్ష్మి గ్లామర్ అన్నీ ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని పొంగల్ విన్నర్‌గా నిలిచింది.
ఈ పొంగల్‌కి విడుదలైన సినిమాల్లో మద గజ రాజా అత్యధిక వసూళ్లు సాధించింది. 8 రోజుల్లో 40 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో 50 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా. 15 కోట్ల బడ్జెట్‌తో తయారైన ఈ సినిమా మూడు రెట్లు వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు వారి అప్పులను మొత్తం తీర్చేస్తుంది.
మద గజ రాజా బాక్స్ ఆఫీస్
అదే సమయంలో వరుస పరాజయాలతో ఉన్న విశాల్‌కి `మద గజ రాజా` రూపంలో అదృష్టం వరించింది. ఆయన ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతుండగా, ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ ఆయనలో రెట్టింపు ఎనర్జీనిచ్చింది. అదే సమయంలో కెరీర్‌కి సక్సెస్ బాట వేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `మద గజ రాజ` దెబ్బకి మిగిలిన తమిళ సినిమాలన్నీ కుదేలయ్యాయి. రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` కూడా దాని ముందు నిలవలేకపోతుంది.