`కూలీ`లో ఇళయరాజా సూపర్ హిట్ సాంగ్.. లోకేష్ ప్లాన్‌కి థియేటర్లలో రచ్చ
లోకేష్ కనకరాజ్ సినిమాల్లో పాత పాటలకు కొదవలేదు. రజనీకాంత్ `కూలీ` సినిమాలో ఆయన వాడిన పాత పాట ఏంటో తెలుసుకుందాం.

`కూలీ` సినిమాలో వింటేజ్ సాంగ్
కొత్త పాటల కంటే పాత పాటలే సినిమాల్లో హిట్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ ని మొదలుపెట్టింది లోకేష్ కనకరాజే. ఖైదీ నుంచి మాస్టర్, విక్రమ్, లియో వరకు అన్ని సినిమాల్లోనూ పాతపాటలు వాడుతున్నారు. ఈ పాటలు మళ్ళీ హిట్ అవుతున్నాయి. `కూలీ`లో ఏ పాట వాడారో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
KNOW
`కూలీ`లో రజనీ `తగమగన్` మూవీలోని అదిరిపోయే సాంగ్
`కూలీ`లో రజనీకాంత్ పాతపాటే వాడారు లోకేష్. `తంగమగన్`(1983) సినిమాలోని 'వా వా పక్కం వా' పాటనే కూలీలో వాడారు. ఈ పాటకు థియేటర్లో మంచి స్పందన వస్తోంది. ఆ పాట వచ్చిన థియేటర్లు హోరెత్తిపోయాయి. ఈ పాట మరోసారి ట్రెండింగ్‌లోకి రాబోతుండటం విశేషం.
లోకేష్ గత చిత్రాల్లో వాడిన పాత పాటలివే
ఖైదీలో 'ఆశ అధికం వచ్చు', 'జుంబలక్క జుంబలక్క', మాస్టర్ లో 'కరుత్త మచ్చాన్', విక్రమ్ లో 'చక్కు చక్కు వత్తికుచ్చు', లియోలో 'కరు కరు కరుప్పాయి', 'తామరపూవుకూడా' పాటలను వాడారు. వాటికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ట్రెండింగ్‌లోకి `కూలీ`లోని `వా వా పక్కం వా` పాట
లోకేష్ వాడే పాతపాటలకు ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. `కూలీ`లో రజినీ పాతపాట 'వా వా పక్కం వా' వాడటం విశేషం. ఈ డిస్కో పాటను కొత్తగా రీమాస్టరింగ్ చేసి వాడారు. దీంతో ఈ పాట కొత్త ఫీల్‌ని తీసుకొస్తుంది. మాస్ ఆడియెన్స్ ని బాగా అలరిస్తోంది. ఇప్పుడిది ట్రెండింగ్‌లోకి వస్తోంది. ఈ పాటకి ఇళయరాజా సంగీతం అందించగా, ఎస్పీ బాలు, వాణి జయరామ్ ఆలపించారు. అప్పట్లో కూడా ఈ పాట విశేష ఆదరణ పొందింది.
`కూలీ`కి మిశ్రమ స్పందన
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన `కూలీ` మూవీ ఈ గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇందులో నాగార్జున విలన్‌గా నటించగా, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కాసేపు మెరిశారు. శృతి హాసన్, సత్య రాజ్ కీలక పాత్రలు పోషించారు. పూజా హెగ్గే మోనికా సాంగ్‌లో రచ్చ చేసింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఫస్ట్ డే మాత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.