- Home
- Entertainment
- Movie Reviews
- `వార్ 2` మూవీ రివ్యూ, రేటింగ్.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన మూవీ అదిరిపోయిందా?
`వార్ 2` మూవీ రివ్యూ, రేటింగ్.. ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన మూవీ అదిరిపోయిందా?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన `వార్ 2` మూవీ గురువారం విడుదలైంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

`వార్ 2` మూవీ రివ్యూ
ఈ గురువారం సినిమా పండగ నెలకొంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన `వార్ 2`, అలాగే రజనీకాంత్, నాగార్జున వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన `కూలీ` చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. ఈ రెండింటిలో ఏ మూవీ చూడాలనేది పెద్ద సస్పెన్స్. ఆ సస్పెన్స్ కి తెరదించుతూ ఎన్టీఆర్ నటించిన `వార్ 2`కే ఫస్ట్ ఓటు వేశాను. సినిమా చూడ్డానికి వచ్చినప్పుడు ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీగా సందడి వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అదే సమయంలో రజనీ మూవీ కూడా ఉండటంతో ఐమాక్స్ కోలాహలంగా మారింది. ఈ ఉత్సాహంతో సినిమా చూడ్డానికి వెళ్లాను.
KNOW
థియేటర్ల వద్ద `వార్ 2` సందడి
ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన మూవీ `వార్ 2`. తారక్‌తోపాటు హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రం నేడు గురువారం (ఆగస్ట్ 14న) విడుదల అయ్యింది. స్పై యాక్షన్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉంది? ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`వార్ 2` మూవీ రివ్యూ
ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన మూవీ `వార్ 2`. తారక్‌తోపాటు హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రం నేడు గురువారం (ఆగస్ట్ 14న) విడుదల అయ్యింది. స్పై యాక్షన్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉంది? ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోయిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`వార్ 2` కథేంటంటే?
చైనా, రష్యా, పాకిస్తాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియాలోని మాఫియా అంతా కలిసి `కలి` అనే సిండికేట్‌గా ఏర్పడతారు. వారంతా ఇండియాపై పట్టు సాధించడం కోసం, ఇండియాని తమ గుప్పిట్లోకి తీసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. కబీర్(హృతిక్ రోషన్) గతంలో రా ఏజెంట్‌గా పనిచేస్తాడు. కానీ కొన్ని కారణాలతో ఆయన రా కి దూరమైన `కలి`కి పనిచేస్తుంటారు. ఈ క్రమంలో కల్నల్ లూత్ర(అషుతోష్ రాణా)ని చంపేస్తారు. ఆ తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్‌ని చంపాలని ప్లాన్ చేస్తుంటారు. దీంతో కబీర్‌ని పట్టుకునేందుకు కొత్తగా రా చీఫ్ కాల్(అనిల్ కపూర్) వస్తాడు. ఆయన టీమ్‌లోకి విక్రమ్ వస్తాడు. కబీర్ ని పట్టుకుని `కలి`ని అంతం చేసేందుకు ఆయన రంగంలోకి దిగుతాడు. వీరి టీమ్‌లో కావ్య లూత్రా(కియారా అద్వానీ) కూడా చేరుతుంది. ఆమె కాల్నల్ లూత్ర కూతురు. వీరంతా కలిసి కబీర్ పట్టుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలో అనుకోని ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. కబీర్ పాత్రలోని ట్విస్ట్, విక్రమ్ పాత్రలోని ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తాయి. మరి ఆ ట్విస్ట్ లేంటి? కబీర్ లోని మరో కోణం ఏంటి? అదే సమయంలో విక్రమ్ ఎవరు? విక్రమ్, కబీర్ ల గతం ఏంటి ? చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది మిగిలిన కథ.
`వార్ 2` మూవీ విశ్లేషణః
బాలీవుడ్ లో వరుసగా స్పై యాక్షన్ మూవీస్ వస్తూ ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. గతంలో `వార్` మూవీ వచ్చి సంచలనం సృష్టించింది. అందులో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఇందులో హృతిక్‌తోపాటు ఎన్టీఆర్ నటించడం స్పెషల్. బాలీవుడ్‌లోకి వెళ్లి, అది కూడా ఈ స్పై సిరీస్‌లో తారక్ భాగం కావడం విశేషం. ఇదే మన తెలుగు ఆడియెన్స్ కి ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్. అయితే మూవీ టీజర్, ట్రైలర్ లు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. మన ఆడియెన్స్ కి ఇలాంటి స్పై మూవీస్ పెద్దగా ఎక్కవు. అదే సమయంలో బాలీవుడ్‌లోనూ వరుసగా అవే కథలతో సినిమాలు వస్తున్నాయి. దీంతో ఈ జోనర్ రొటీన్‌గా మారింది. ఇది కూడా బజ్ లేకపోవడానికి కారణమని చెప్పొచ్చు.
`వార్ 2` కూడా రెగ్యూలర్ స్పై యాక్షన్ మూవీగానే నిలిచిందని చెప్పొచ్చు. థియేటర్‌లోకి వెళ్లినప్పట్నుంచి ఆ ఫీలింగ్ ఆడియెన్స్ లో కనిపించింది. అయితే సినిమా ప్రారంభంలో హృతిక్ ఎంట్రీ చూపించారు. చాలా సేపు ఆయనపై యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు. యాక్షన్ బాగున్నా, లెన్తీగా ఉండటంతో కొంత రొటీన్ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత కల్నల్ లూత్రాని చంపడం, ఆయన స్థానంలో కొత్త రా ఛీఫ్‌గా అనిల్ కపూర్ ఎంట్రీ ఇవ్వడం, ఆయన టీమ్‌లోకి విక్రమ్‌గా ఎన్టీఆర్ రావడం ఇందులో హైలైట్‌గా నిలిచింది. తారక్ ఎంట్రీని బాగా చూపించారు. అదిరిపోయే యాక్షన్ సీన్లు పెట్టారు. అందులో రెచ్చిపోయారు ఎన్టీఆర్. తారక్ ఎంట్రీ సమయంలో ఫ్యాన్స్ అరుపులతో థియేటర్ దద్దరిల్లింది.
ఆ తర్వాత ఆయన యాటిట్యూడ్ కూడా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ ఎంట్రీ నుంచి వరుసగా ఛేజింగ్ సీన్లు ఉంటాయి. హృతిక్, తారక్ మధ్య ఈ సీన్లు మెయిన్‌గా ఉంటాయి. ఆయా సీన్లు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ట్రైన్ ఛేజింగ్ సీన్, ఫ్లైట్ సీన్లు బాగున్నాయి. కానీ ఓవర్‌గా అనిపించేలా ఉన్నాయి. ఇద్దరూ ఎదురుపడటం, హోరా హోరీగా రేసింగ్ చేయడం, తప్పించుకోవడమే ఉంటుంది. ఇంటర్వెల్ వరకు అలానే ఉంటుంది. అయితే ఈ ఇద్దరు కాఫీ షాప్‌లో కలిసి మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఇద్దరు కలసి డాన్స్ చేయడం అదిరిపోయింది. కాకపోతే ఆ సందర్భాన్ని బలవంతంగా ఇరికించినట్టుగానే ఉంది. ఇంటర్వెల్‌లో ట్విస్ట్ ఫర్వాలేదు.
`వార్ 2` మూవీలో హైలైట్స్, మైనస్ లు
సెకండాఫ్ మొత్తం కబీర్ ని పట్టుకునేందుకు విక్రమ్ ప్రయత్నించడం, ఈ క్రమంలోనే విక్రమ్ పాత్రలో చిన్న ట్విస్ట్ ఇవ్వడంతో కథేంటో అర్థమవుతుంది. కాకపోతే ఆ ట్విస్ట్ గొప్పగా లేదు. ఊహించినట్టుగానే ఉంది. పెద్ద థ్రిల్ ఇవ్వలేకపోయింది. సెకండాఫ్ అంతా రొటీన్‌గానే సాగుతుంది. సవాళ్లు విసురుకోవడం, ఎత్తులు వేయడం, దాన్ని బ్రేక్ చేయడంతో నడుస్తుంది. చిన్న చిన్న ట్విస్ట్ లు పెట్టినా అవి కూడా పండలేదు. అయితే సెకండాఫ్‌లో కబీర్, విక్రమ్‌ల చిన్నప్పటి సీన్లు ఫర్వాలేదనిపించాయి. వీరి మధ్య స్నేహాన్ని బిల్డ్ చేశాయి. అవి క్లైమాక్స్ లో ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. క్లైమాక్స్ ఓ పది నిమిషాలు కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది.
చిన్న ట్విస్ట్ లాగా ఇచ్చి తారక్ ఫ్యాన్స్ ని హ్యాపీ చేశారు. సినిమాలో పెద్దగా కథ లేదు. కేవలం ఎత్తులు పై ఎత్తులు, ఇండియాని `కలి` సిండికేట్ తమ కంట్రోల్‌లోకి తీసుకోవడానికి కబీర్, విక్రమ్‌లను వాడుకోవడమే ఉంటుంది. దీని కోసం కొంత డ్రామా క్రియేట్ చేశారు. అయితే ఇందులో యాక్షన్ సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్ బాగుంది. కానీ ఏమాత్రం ఎమోషనల్ కనెక్షన్ లేదు. భావోద్వేగాలు పండలేదు. వాటికంటే యాక్షన్ కే ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంది. ఇంకోవైపు ఇందులో మన తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు లేవు. అదే ఇందులో పెద్ద మైనస్. ఎన్టీఆర్ పాత్రలోనూ హడావుడి తప్ప, మనవైన భావోద్వేగాలకు ప్రయారిటీ ఇవ్వలేకపోయారు. దీనికితోడు ఇద్దరి డాన్సులు ఆకట్టుకున్నా, పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. హృతిక్, తారక్‌ల మధ్య డైలాగ్‌లు కూడా అంతగా పవర్‌ఫుల్‌గా లేవు. రొటీన్‌గానే అనిపిస్తాయి. డబ్బింగ్‌కూడా సహజంగా లేదు.
దేశభక్తి ఎలిమెంట్లు కూడా ఏమాత్రం సహజంగా లేవు. ఇలాంటివి చాలానే చూశాం. దీంతో ఇది రొటీన్ అనిపిస్తుంది. టైమ్ పీరియడ్ విషయంలో లాజిక్ లు మిస్ అయ్యారు. సో ఇలా `వార్ 2` రొటీన్ స్పై యాక్షన్ మూవీగా నిలిచింది. మన తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం కష్టమనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ ఎలివేషన్లు వచ్చినప్పుడు ఆయన అభిమానులు హోరెత్తించారు. ఆ సమయంలో తప్ప మరేదీ ఎగ్జైటింగ్ అనిపించలేదు. సినిమా చూసిన ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. తారక్ ఫ్యాన్సే డిజప్పాయింట్ అయ్యారు. ఇలాంటి కథని ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకున్నాడని అనడం గమనార్హం.
`వార్ 2` నటీనటుల ప్రదర్శన
విక్రమ్‌గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. రా ఏజెంట్‌గా బాగా చేశాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ వాహ్ అనిపిస్తుంది. యాక్షన్‌లోనూ దుమ్ములేపారు. ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి. కాకపోతే ఆయన్నుంచి మనవైన ఎమోషన్స్ మిస్ అయ్యాయి. అదే సమయంలో ఎన్టీఆర్ లుక్ డిజప్పాయింట్ చేస్తుంది. కొన్ని సీన్లలో సన్నగా, మరికొన్ని సీన్లలో లావుగా కనిపించారు. సీన్లకి పొంతన లేదు. ఇక కబీర్‌గా మాజీ రా ఏజెంట్‌గా హృతిక్ రోషన్ కనిపిస్తారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదరగొట్టారు. ఆయన పాత్రల్లోని ట్విస్ట్ కూడా బాగానే ఉంది. యాక్షన్ సీన్లు హైలైట్‌గా చెప్పొచ్చు. కావ్య గా కియారా అద్వానీ బాగానే మెప్పించింది. గ్లామర్‌గా ఆకట్టుకుంది. మరో వైపు రా చీఫ్‌గా అనిల్ కపూర్, కల్నల్‌గా అషుతోష్ రాణా కాసేపు మెప్పించారు. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకే. కానీ సినిమా మొత్తం హృతిక్, ఎన్టీఆర్ ల మీదనే నడుస్తోంది. ఈ ఇద్దరు యాక్షన్‌తో ఆడుకున్నారు.
`వార్ 2` టెక్నీషియన్ల పనితీరుః
సినిమాకి `ప్రీతం సంగీతం అందించారు. ఇద్దరు హీరోలు కలిసి నటించిన పాట కాస్త ఫర్వాలేదు. ఇక అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా బీజీఎం జస్ట్ యావరేజ్‌గా ఉంది. కొన్ని చోట్ల ఓకే అనిపించింది. కానీ రొటీన్ ఫీలింగ్ కలిగించింది. బెంజమిన్ జాస్ఫర్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ గ్రాండియర్‌గా ఆకట్టుకుంది. యాక్షన్ సీన్లని బాగా చిత్రీకరించారు. ఆరిఫ్ షేఖ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. సీన్ల మధ్య పొంతన కుదరలేదు. నిర్మాణ విలువలకు కొదవలేదు. రిచ్‌గా ఉంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ రొటీన్ స్టోరీని తెరకెక్కించారు. యాక్షన్ సీన్లుని, హృతిక్, కియారా లవ్ ట్రాక్‌లో ఎమోషన్స్ బాగానే తీశారు. అదే సమయంలో క్లైమాక్స్ లో ఎమోషన్స్ బాగానే ఉంది. మిగిలినదంతా రొటీన్ ఫీలింగ్ కలిగిస్తుంది. తన మార్క్ ఏమాత్రం కనిపించలేదు.
ఫైనల్‌గాః రొటీన్ స్పై యాక్షన్ మూవీ `వార్ 2`. జస్ట్ హృతిక్, తారక్‌ల యాక్షన్ కోసమే.
రేటింగ్‌ః 2.5