- Home
- Entertainment
- Ram Charan: ఫైవ్ స్టార్ హోటల్ లో రాంచరణ్ తో లోకేష్ కనకరాజ్ సీక్రెట్ మీటింగ్.. సంథింగ్ బిగ్ ?
Ram Charan: ఫైవ్ స్టార్ హోటల్ లో రాంచరణ్ తో లోకేష్ కనకరాజ్ సీక్రెట్ మీటింగ్.. సంథింగ్ బిగ్ ?
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని ఊపేస్తున్న పేరు లోకేష్ కనకరాజ్. సౌత్ నుంచి డైరెక్టర్ రెడీ అవుతున్నాడు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విక్రమ్ తో లోకేష్ కనకరాజ్ సృష్టించిన సంచలనం అలాంటింది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని ఊపేస్తున్న పేరు లోకేష్ కనకరాజ్. సౌత్ నుంచి డైరెక్టర్ రెడీ అవుతున్నాడు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విక్రమ్ తో లోకేష్ కనకరాజ్ సృష్టించిన సంచలనం అలాంటింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలయ్యింది. తమిళనాట ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. 300 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకుపోతోంది.
<p>லோகேஷ் கனகராஜ் - விஜய் கூட்டணியில் உருவாகியுள்ள மாஸ்டர் திரைப்படம் கடந்த ஏப்ரல் மாதம் வெளியாகியிருக்க வேண்டியது. ஆனால் கொரோனா பிரச்சனை காரணமாக படத்தில் ரிலீஸ் தள்ளிவைக்கப்பட்டுள்ளது. </p>
లోకేష్ కనకరాజ్ తన టేకింగ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. దీనికి తోడు కమల్ నటన జత కావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతున్నాయి. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే కథలో లోకేష్ కనకరాజ్ అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకుని జీనియస్ అనిపించుకున్నాడు.
Lokesh Kanagaraj wants fans to revisit Kaithi before watching Vikram
ఒక్కో పాత్రని పవర్ ఫుల్ గా చూపిస్తూ మతి పోగొట్టేశాడు. కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి పాత్రలు విక్రమ్ మూవీలో సాలిడ్ గా ఉంటాయి. అంతటి ప్రతిభావంతుడు కాబట్టే లోకేష్ కనకరాజ్ వెంట స్టార్ హీరోలు పడుతున్నారు. ఇదిలా ఉండగా లోకేష్ కనకరాజ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో త్వరలో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Ram Charan
లోకేష్ నెక్స్ట్ మూవీ ఇళయదళపతి విజయ్ తో ఉండబోతోంది. ఈ చిత్రం తర్వాత రాంచరణ్ తో మూవీ పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి ప్లానింగ్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ విక్రమ్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చారు. ఈ టైం లో లోకేష్ రాంచరణ్ ని ఓ ఫైన్ స్టార్ హోటల్ లో మీట్ అయినట్లు తెలుస్తోంది.
Image: Ram Charan/Instagram
ఎలాంటి కథతో సినిమా చేయాలి అనే అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ రాంచరణ్ కోసం భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
జరుగుతున్న మరో ప్రచారం ప్రకారం రాంచరణ్.. విక్రమ్ - ఖైదీ సిరీస్ లో భాగం అవుతాడని అంటున్నారు. మరికొందరైతే విక్రమ్ లో కమల్ హాసన్ మనవడు పెరిగి పెద్దయ్యాక రాంచరణ్ అవుతాడని.. ఆ పాత్రతో ఓ సినిమా ఉంటుందని కథలు సృష్టించేస్తున్నారు. అయితే ఇది వాస్తవం కాకపోవచ్చు. కమల్ మనవాడి పాత్రతో సినిమా చేయాలనంటే.. విక్రమ్ సిరీస్ లో కమల్ హాసన్ కొనసాగే వీలు ఉండదు. సో ఇది రూమర్ మాత్రమే.
ఏది ఏమైనా త్వరలో లోకేష్, రాంచరణ్ కాంబోలో భారీ చిత్రం పట్టాలెక్కడం మాత్రం ఖాయం. అది ఎలాంటి కథ అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.