MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lock Upp:టాప్ బిజినెస్ మాన్ భార్యతో శృంగారం చేశాను... కంగనా షోలో కంటెస్టెంట్ సంచలన కామెంట్స్

Lock Upp:టాప్ బిజినెస్ మాన్ భార్యతో శృంగారం చేశాను... కంగనా షోలో కంటెస్టెంట్ సంచలన కామెంట్స్

లాక్ అప్ రియాలిటీ (Lock Upp)షో కంటెస్టెంట్ తెహ్సీన్ పూనావాలా ప్రముఖ పారిశ్రామికవేత్త భార్యతో శృంగారం చేశానని చెప్పడం సంచలనంగా మారింది. ఈ వారం షో నుండి ఎలిమినేటైన తెహ్సీన్ గేమ్ లో భాగంగా టాప్ సీక్రెట్ రివీల్ చేశారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 13 2022, 06:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)హోస్ట్ గా లాక్ అప్ పేరుతో రియాలిటీ షో మొదలైంది. ఏక్తా కపూర్ నిర్మాతగా ఉన్న ఈ షోలో ఆల్ట్ బాలాజీ, ఎమ్ ఎక్స్ ప్లేయర్స్ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో ప్రసారమవుతుంది. బోల్డ్ కంటెంట్ తో సాగుతున్న లాక్ అప్ షోకి మంచి ఆదరణ దక్కుతున్నట్లు సమాచారం. అయితే కంటెస్టెంట్ తెహ్సీన్ పూనావాలా చేసిన కామెంట్ ఇండస్ట్రీని ఊపేస్తోంది. 

26


మార్చి 12న తెహ్సీన్ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అతి తక్కువ ఓట్లు పొందిన తెహ్సీన్ ప్రేక్షకుల నిర్ణయం మేరకు ఎలిమినేట్ కావడం జరిగింది. అయితే తాను ఓ కంటెస్టెంట్ ని సేవ్ చేసే ఛాన్స్ హోస్ట్ కంగనా ఇచ్చారు. దాని కోసం తెహ్సీన్ తన జీవితంలో జరిగిన టాప్ సీక్రెట్ బయటపెట్టాలని కంగనా కండీషన్ పెట్టారు. 

36

హౌస్ లో తనకు ఇష్టమైన కంటెస్టెంట్ సైషా షిండేని సేవ్ చేయడానికి తెహ్సీన్ ( Tehseen Poonawalla)ఓ సీక్రెట్ రివీల్ చేశారు. ఆ సీక్రెట్ విన్న ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యింది. దేశంలోనే గొప్ప పారిశ్రామిక వేత్త ఒకరు తెహ్సీన్ ని తన భార్యతో శృంగారం చేయాలని కోరాడట. అందు కోసం ఓ లగ్జరీ నైట్ క్లబ్ వీకెండ్ రెండు రోజులు బుక్ చేశాడని తెహ్సీన్ తెలిపారు. 
 

46

ఆ వ్యాపారవేత్త భార్యతో నువ్వు శృంగారం చేశావా? అని కంగనా రనౌత్ అడుగగా... అవును నేను ఎంజాయ్ చేశాను. అయితే ఆయన ఓ కండీషన్ పెట్టాడు. మేము శృంగారం చేస్తున్నప్పుడు దూరం నుండి చూస్తానని కండీషన్ పెట్టాడు. ఆయనకు అలాంటి చిత్రమైన కోరికలు ఉన్నాయి. నేను దానికి ఒప్పుకున్నాను, అయితే దూరం నుండి చూడాలే తప్ప డిస్టర్బ్ చేయకూడదని నేను కూడా కండీషన్ పెట్టాను అన్నారు. 
 

56


ఇలాంటి జుగుప్సాకరమైన కామెంట్స్ వెనుక ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అలాగే సెన్సేషన్ కోసం, షో వ్యూవర్షిప్ కోసం కూడా ఇలాంటి కామెంట్స్ చేసే అవకాశం కలదు. మొత్తంగా కామెంట్స్ తో షోకి పిచ్చ పాపులారిటీ వచ్చి పడింది. ఇక తెహ్సీన్ పొలిటికల్ అనలిస్ట్ గా సుపరిచితుడు. 

66

హోస్ట్ గా కంగనా మొదటి ప్రయత్నం ఫలిస్తున్నట్లే కనిపిస్తుంది. ఓటీటీ రియాలిటీ, టాక్ షోలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో స్టార్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. మరి లాక్ అప్ టాక్ షో ముగిసే నాటికి ఇంకెన్ని సంచలనాలు నమోదు కానున్నాయో.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!
Recommended image2
Mad for Each Other: బిగ్‌ బాస్‌ ని దెబ్బకొట్టే రియాలిటీ షో వస్తోంది.. మొత్తం మసాలా.. లవర్స్ కి మాత్రం పండగే
Recommended image3
OTT Movies: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 7 మూవీస్.. అస్సలు మిస్ కాకుండా ఓటీటీలో చూడాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved