చిన్న సినిమా, భారీ విజయం.. లిటిల్ హార్ట్స్ రెండో రోజు కలెక్షన్స్ డబుల్..
Little Hearts Collections: ‘లిటిల్ హార్ట్స్’ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తుంది. యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్‌కి వస్తున్నారు. ఈ చిన్న సినిమానే మొదటి రోజే సెన్సేషన్ సృష్టించింది. రెండో రోజుకి కలెక్షన్స్ మరింతగా పెరిగాయి.

లిటిల్ హార్ట్స్ బాక్స్‌ఆఫీస్ సెన్సేషన్..
Little Hearts Collections: స్టార్ హీరోలు లేకుండానే కేవలం కథా బలంతో ముందుకు వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిన్న సినిమా, రెండో రోజుకి కలెక్షన్లను రెట్టింపు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలే వరుసగా వస్తున్నాయి. టికెట్ ధరలు పెరిగిన ఈ పరిస్థితుల్లో సాధారణంగా ఒక సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి వారం రోజులు పడుతుంది. కానీ ఈ సెంటిమెంట్‌కి భిన్నంగా ‘‘లిటిల్ హార్ట్స్’’ మాత్రం కేవలం ఒక రోజులోనే పెట్టుబడులు వసూలు చేసి, రెండో రోజునుంచే లాభాల బాట పట్టి, చిన్న సినిమాలకు కొత్త బాట చూపిస్తోంది.
కంటెంట్‌కి ప్రాధాన్యం
‘90s బయోపిక్’ ఫేమ్ మౌళి తనూజ్ హీరోగా పరిచయమయ్యాడు. అతనికి జోడీగా ‘‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’’ఫేమ్ శివాని నటించింది. ఈ సినిమాను డైరెక్టర్ సాయి మార్తాండ్ తెరకెక్కించగా, 90s బయోపిక్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 5) లిటిల్ హార్ట్స్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రైట్స్‌ను హ్యాండిల్ చేశారు. తండ్రీ–కొడుకుల సంబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, స్కూల్ బ్యాక్‌డ్రాప్ , యూత్ ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కంటెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చిన ఈ ప్రయోగం ఘనవిజయం సాధించి, చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించగలదని మరోసారి నిరూపించింది.
ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్!
‘లిటిల్ హార్ట్స్’ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తుంది. యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్‌కి వెళ్లేలని ఫీలవుతున్నారు. అసభ్యకర సీన్స్ లేకుండా, మొదటి నుంచి చివరి వరకు క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం ఈ సినిమాకి పెద్ద హైలైట్‌గా నిలిచింది. ‘లిటిల్ హార్ట్స్’సినిమాను కేవలం రూ.1.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మొదట ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు.
అయితే థియేట్రికల్ రైట్స్‌ను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఫలితంగా రెండు రోజుల్లోనే పెట్టుబడి తిరిగి వచ్చి, లాభాల్లోకి దూసుకుపోయింది. ఈ చిన్న సినిమానే మొదటి రోజే ఆ బడ్జెట్‌ను వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. రెండో రోజుకి కలెక్షన్స్ మరింతగా పెరిగి, లాభాల్లోకి చేరుకుంది. ఆదివారం హాలిడే బూస్ట్‌తో మరింత బలంగా దూసుకుపోతుందని అంచనా.
బాక్సాఫీస్ దగ్గర లిటిల్ హార్ట్స్ సెన్సేషన్
స్టార్ హీరోలు లేకుండా, కేవలం కథా బలంతో ముందుకు వచ్చిన ‘‘లిటిల్ హార్ట్స్’’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన మొదటి రోజు మొదటి రోజు రూ.1.35 కోట్ల నెట్ వసూలు సాధించింది. ఇక రెండో రోజు ఏకంగా రూ.3.09 కోట్లు కొల్లాకొట్టింది. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా రూ.5 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇందులో 90 లక్షల వసూళ్లు ఓవర్సీస్ నుంచే రావడం విశేషం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఆదివారం కలెక్షన్లతో ఆ మార్కెట్‌లో కోటి దాటే అవకాశం ఉంది.