- Home
- Entertainment
- LSS Review:'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' ప్రీమియర్ షో టాక్.. సంతోష్, ఫరియా కామెడీ బావుందా.. బెడిసికొట్టిందా?
LSS Review:'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' ప్రీమియర్ షో టాక్.. సంతోష్, ఫరియా కామెడీ బావుందా.. బెడిసికొట్టిందా?
ట్యాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ మరో కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. యువ హీరో సంతోష్ శోభన్, జాతిరత్నాలు భామ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' చిత్రం నేడు రిలీజ్ అవుతోంది.

ట్యాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ మరో కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. యువ హీరో సంతోష్ శోభన్, జాతిరత్నాలు భామ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. ట్రైలర్, టీజర్స్ లో వినోదాత్మక అంశాలు ఉండడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' చిత్రానికి టాక్ మొదలయింది. 1990 ఫ్లాష్ బ్యాక్ సీన్ తో సినిమా ఓపెన్ అవుతుంది. నక్సలిజంకి సంబంధించిన సన్నివేశాలు మొదలవుతాయి. హీరో సంతోష్ ట్రావెల్ వీడియోలు చేసే కుర్రాడిగా కనిపిస్తాడు. నక్సల్స్ ఉండే ప్రాంతానికే ట్రావెల్ వీడియోలు చేసేందుకు వెళతాడు.
ఫస్ట్ హాఫ్ లో కామెడీ అక్కడక్కడా మాత్రమే వర్క్ అయింది. మిగిలిన కామెడీ డైలాగ్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఏదైనా ట్రావెల్ వీడియో రన్ అవుతోందా అనే ఫీలింగ్ కలుగుతుంది. తన యూట్యూబ్ ఛానల్ ని పాపులర్ చేసి డబ్బు సంపాదించాలనేది హీరో లక్ష్యం.
ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చికాకు పెట్టించేలా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కూడా గొప్పగా ఏమీ ఉండదు. దీనితో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా తేలిపోయింది అనే చెప్పాలి. సిల్లీగా అనిపించే కామెడీ బిట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. యంగ్ టీం కొత్తగా ప్రయత్నించి ఏదో గొప్ప ప్రయత్నమే చేశారు అంటే పొరపాటే. యూట్యూబ్ లో ఇతర సోషల్ మీడియాలో అక్కడక్కడా చూసే కామెడీ ఎలిమెంట్స్ ని చిత్ర యూనిట్ నమ్ముకున్నారు.
హీరో ట్రావెల్ వీడియో చేసే వ్యక్తి కనుక ఫస్ట్ హాఫ్ ఇంకా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కిడ్నాప్ డ్రామా, కామెడీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. రామ్ మిర్యాల పాడిన 'లచ్చుమమ్మ' సాంగ్ సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కి బిగ్ రిలీజ్ అనే చెప్పాలి. ఆ పాట చిత్రీకణ బాగా ఆకట్టుకుంటుంది.
ఆ సాంగ్ లో ఫరియా గ్లామర్, సంతోష్ స్టెప్పులు బావుంటాయి. డైరెక్టర్ మేర్లపాక గాంధీ చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా మిస్ ఫైర్ ఐంది అని ఆడియన్స్ అంటున్నారు. హీరో ట్రావెల్ జర్నీ, నక్సల్స్ సన్నివేశాలు చిత్రంలో పార్లల్ గా జరుగుతూ ఉంటాయి.
ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కాస్త వేగంగా ఉంటుంది. అంతే తప్ప సెకండ్ హాఫ్ కూడా నిరాశపరిచి విధంగానే ఉంటుంది. ఈ తరహా కథతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రాణించడం కష్టమే అని ఆడియన్స్ అంటున్నారు. నటన పరంగా మాత్రం సంతోష్ శోభన్ వేరియేషన్స్ అద్భుతంగా చూపించాడు. సంతోష్ నటన, ఫరియా గ్లామర్ ఈ చిత్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళతాయో చూడాలి.