- Home
- Entertainment
- Liger Team : అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో ‘లైగర్’ టీం సందడి.. వైరల్ అవుతున్న పిక్స్..
Liger Team : అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో ‘లైగర్’ టీం సందడి.. వైరల్ అవుతున్న పిక్స్..
ధర్మ ప్రొడక్షన్ సీఈవో అపూర్వ మెహతా (Apoorva Mehta) బర్త్ డే పార్టీలో ‘లైగర్’ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా బ్లాక్ అండ్ బ్లాక్ లో ఈ యూనిట్ పార్టీలో అట్రాక్టివ్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే మరింత ఆకర్షణీయంగా ఉన్నారు.

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) తన సన్నిహితురాలు ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అయిన అపూర్వ మెహతా కోసం గ్రాండ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశారు. టిన్సెల్ పట్టణానికి చెందిన ప్రముఖుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామం పంచుకున్న ‘లైగర్’(Liger) టీం కూడా గ్రాండ్ పార్టీలో పాల్గొంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ కూడా స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో చేరారు.
అయితే స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడంతో లిగర్ టీమ్ అందరినీ ఆకర్షించింది. ఈవెంట్ కోసం బ్లాక్ డ్రెస్ కోడ్‌ను అనుసరించి, చిత్ర బృందం నలుపు రంగు దుస్తులను ధరించి కనిపించింది. అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ బ్లాక్ జాకెట్ మరియు బ్లాక్ ప్యాంట్‌లో స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.
మరోవైపు అనన్య పాండే (Ananya Panday) కూడా ట్రెండీ అవుట్ ఫిట్ పార్టీకి చేరుకుంది. మరీ ముఖ్యంగా అనన్య ధరించే దుస్తులు ఇటీవల కాలంలో మరీ హాట్ గా ఉంటున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఫొటోషూట్లలోనూ లైగర్ బ్యూటీ గ్లామర్ షో మామూలుగా ఉండటం లేదు. అనన్య అందానికి ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. పైగా బాలీవుడ్ లోనూ ఒక్కోమెట్టు ఎక్కుతూ తన పాపులారిటీని పెంచుకుంటోందీ బ్యూటీ.
అయితే ఈ బర్త్ డే పార్టీలో విజయ్, పూరీ, చార్మి, అనన్య కలిసి అపూర్వను విషెష్ చేశారు. బాలీవుడ్ తారల మధ్య వీరి టీం కూడా వారెవ్వా అనిపించింది. ప్రస్తుతం ఈ పొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు చార్మి తన ఇన్ స్టాలో విజయ్, అనన్య పాండే మాట్లాడుకుంటున్న వీడియోను పోస్ట్ చేసింది. లైగర్ మూవీ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రానుంది.