Ananya Panday Photos : లైగర్ బ్యూటీ అందాల ధాటి.. అనన్య పాండే లేటెస్ట్ పిక్స్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోయిన్ అనన్య పాండే అందాల ధాటికి కుర్రాళ్లు చిత్తవుతున్నారు. ట్రెండీ వేర్ లో అనన్య గ్లామర్ షో మామూలుగా లేదు.

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Jagannadh) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ Liger.ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, హీరో యష్ జోహార్ మరియు జగన్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కిక్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) ఆడి పాడనుంది. స్పోర్ట్స్ యాక్షన్ చిత్రంగా ‘లైగర్’ ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కానుంది.
అయితే అనన్య పాండే లైగర్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇప్పటికే విజయ్, అనన్య పేర్ ఆడియెన్స్ లో ఎంగ్జైట్ మెంట్ పెంచుతోంది. త్వరలోనే అనన్య తన గ్లామర్ తో తెలుగు ఆడియెన్స్ ను అలరించనుంది.
ఈ బ్యూటీ ఇటు తెలుగు చిత్రంలో పాటు, అటు హిందీ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. చివరిగా హిందీలో గెహ్రైయాన్ (Gehraiyaan) మూవీలో బోల్డ్ సీన్లలోనూ నటించి, అందరినీ షాక్ కు గురి చేసింది. దీంతో బాలీవుడ్ లో అనన్య హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల మరో సినిమాకు కూడా సైన్ చేసిందీ బ్యూటీ. ‘కో గయే హమ్ కహన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ లో ప్రస్తుతం అనన్య బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
తాజాగా అనన్య పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ మినీ డ్రెస్ లో అనన్య అందాల ఆరబోతకు కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతోంది. థండర్ థైస్ షోతో నెటిజన్ల గుండెల్ని కొల్లగొడుతోంది. అయితే తాజాగా అనన్య IIFA అవార్డ్స్ 2022 ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా లేటెస్ట్ అవుట్ ఫిట్ లో అందరినీ ఆకట్టుకుంది.