MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bappi Lahiri Networth:లెజెండరీ సింగర్ బప్పీ లహరి లగ్జరీ కార్లు, భవనాలు, ఆస్తుల విలువ ఎంతంటే!

Bappi Lahiri Networth:లెజెండరీ సింగర్ బప్పీ లహరి లగ్జరీ కార్లు, భవనాలు, ఆస్తుల విలువ ఎంతంటే!

భారతీయ సంగీతానికి పాశ్చాత్య హంగులు అద్ది... సరికొత్త డిస్కో సాంగ్స్ రూపొందించిన ఘనత బప్పీ లహరి(Bappi Lahiri) సొంతం.దశాబ్దాల పాటు బప్పీ లహరి సంగీత ప్రియులను తన పాటలతో ఓలలాడించారు. బప్పీ లహరి 'డిస్కో డాన్సర్', 'చల్తే చల్తే' మరియు 'షరాబి' వంటి చిత్రాలకు అద్భుతమైన ఆల్బమ్ అందించారు. 

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 16 2022, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


మ్యూజిక్ కంపోజర్ గా, సింగర్ గా బప్పీ లహరి కీర్తితో పాటు సంపద కూడా కూడబెట్టారు. బప్పి లహరి ఆస్తులు, ఖరీదైన, కార్లు, భవనాల గురించి తెలుసుకుందాం..  బప్పీ లహరి కెరీర్ లో అనేక మ్యూజిక్ కాన్సర్ట్స్  నిర్వహించారు. అలాగే వివిధ మ్యూజిక్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. 

25

ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం , బప్పీ లహరి ఆస్తుల విలువ $3 మిలియన్లు (రూ. 22 కోట్లు) అని వినికిడి. ఒక్కో పాటను కంపోజ్ చేయడానికి అత్యధికంగా ఆయన రూ.  8-10 లక్షలు తీసుకునేవారట. ఇక లైవ్ మ్యూజిక్ షోల ద్వారా ఆయన బాగా ఆర్జించినట్లు సమాచారం. సదరు షోలకు ఆయన గంటకు రూ. 20-25 లక్షలు వసూలు చేసేవాడట. బప్పీ లహరి ఛారిటీ కోసం  కొన్ని లైవ్ మ్యూజిక్ షోలు చేశారు. 

35
Image: Bappi Lahiri/Instagram

Image: Bappi Lahiri/Instagram

బప్పీ లహరి  ముంబైలోని విలాసవంతమైన ఇంట్లో నివసించాడు.ఈ ఇంటిని ఆయన 2001లో కొనుగోలు చేశారు. ఆ ఇంటి విలువ దాదాపు రూ. 3.5 కోట్లు. అలాగే బప్పీ లహరి BMW, Audi, Tesla X వంటి కొన్ని అత్యుత్తమ లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

45

బప్పీ లహరి ప్రతిరోజూ కనీసం 7-8 బంగారు గొలుసులను ధరించేవాడు. బంగారం ధరించడం ద్వారా అదృష్టం దక్కుతుందని ఆయన సెంటిమెంట్.ఓ రిపోర్ట్ ప్రకారం  ప్రకారం, 2014 నాటికి బప్పీ లహరి 754 గ్రాముల బంగారు ఆభరణాలను కలిగి ఉన్నారు. సదరు బంగారు ఆభరణాల అప్పటి ఖరీదు17,67,451. బప్పీ లహరి ఒంటినిండా బంగారంతో అలంకరించుకునేవారు. అలాగే ఖరీదైన దుస్తులు ధరించేవారు. 

55

ఒకే సంవత్సరం (1986)లో విడుదలైన 33 చిత్రాలకు గాను 180కి పైగా పాటలను రికార్డ్ చేసినందుకు బప్పీ లహరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రికార్డు సృష్టించారు. బప్పీ లహరి కంపోజ్ చేసిన ఫేమస్ సాంగ్..  జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా 2008 హాలీవుడ్ చిత్రం 'యు డోంట్ మెస్ విత్ ది జోహాన్‌లో ప్రదర్శించబడింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?
Recommended image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image3
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved