MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Singeetham Srinivasa Rao Passes Away: టాలీవుడ్ లో తీరని విషాదం, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనీవాసరావు కన్నుమూత..

Singeetham Srinivasa Rao Passes Away: టాలీవుడ్ లో తీరని విషాదం, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనీవాసరావు కన్నుమూత..

Singeetham Srinivasa Rao: తెలుగు సినీపరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు.. ప్రయోగాలకు పెట్టింది పేరు.. సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన కన్నుమూశారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 03 2026, 11:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడు..
Image Credit : our own

ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడు..

తెలుగు పరిశ్రమకు మాత్రమే కాదు.. తన సినిమాలతో భారతీయ చలనచిత్ర రంగానికి వన్నె తెచ్చిన మహోన్నత దర్శకుడు, వినూత్న ప్రయోగాల సృష్టికర్త సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. చిత్రసీమ ఒక అద్భుతమైన దిగ్గజాన్ని, ట్రెండ్ సెట్టర్‌ను కోల్పోయిందని చిత్ర ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సృజనాత్మకతకు.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్..
Image Credit : Asianet News

సృజనాత్మకతకు.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్..

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 60కి పైగా చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు, సినిమా సాంకేతికతకు కొత్త రూపు ఇచ్చారు. మాటలు లేకుండా కేవలం హావభావాలతో నడిచే మూకీ చిత్రం ‘పుష్పక విమానం’తో ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించారు. అలాగే తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా నిలిచిన ‘ఆదిత్య 369’, అద్భుత జానపద కళాఖండం ‘భైరవద్వీపం’ వంటి సినిమాలు ఆయన దర్శకత్వ ప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనాలు.

34
విశ్వనటుడు కమల్ హాసన్‌తో అపూర్వ అనుబంధం
Image Credit : Google

విశ్వనటుడు కమల్ హాసన్‌తో అపూర్వ అనుబంధం

కమల్ హాసన్‌తో సింగీతం చేసిన ప్రయోగాలు భారతీయ సినిమాలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ‘అపూర్వ సహోదరర్లు’లో పొట్టి కమల్ క్యారెక్టర్, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘అమావాస్య చంద్రుడు’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అలాగే కన్నడ నటసార్వభౌమ రాజ్‌కుమార్‌తోనూ ఆయన ఎన్నో ఘనవిజయాలను అందుకున్నారు. ‘మయూరి’ చిత్రంతో నటి సుధాచంద్రన్ జీవిత కథను తెరకెక్కించి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు.

44
చివరి శ్వాస వరకు సినిమాయే ..
Image Credit : Asianet News

చివరి శ్వాస వరకు సినిమాయే ..

94 ఏళ్ల వయసులో కూడా ఆయన సినిమాలపై ఉన్న మక్కువను వీడలేదు. ఇటీవల వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తన 61వ చిత్రాన్ని (SSR61) ప్రకటించి, ఈ వయసులోనూ మెగాఫోన్ పట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు, సృజనాత్మక ఆలోచనలు ఎప్పటికీ అమరంగా ఉంటాయని కొనియాడారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: బిగ్ బాస్ ఏం పీకలేడు అనుకున్నావా.. కోపంతో ఊగిపోయిన నాగార్జున, రౌడీ వేషాలు, చిల్లర కామెంట్లకు ఇచ్చిపడేశాడుగా
Recommended image2
Premane Oorilo Movie Review: ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. కన్నడలో హిట్‌, మరి ఇక్కడ ?
Recommended image3
Venu Swamy: వేణు ఉడుగుల కోసం వేణు స్వామి తన లైఫ్‌లో ఫస్ట్ టైమ్‌ చేసిన పని ఇదే.. చంద్రయాన్‌ గ్లింప్స్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved