Guppedantha Manasu: వసుధారని బెదిరిస్తున్న లెక్చరర్స్.. విష్ కాలేజీకి వెళ్లబోతున్న రిషి దంపతులు!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తమ్ముడు ప్లానింగ్ చూసి చెమటలు కక్కుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో బయటికి వచ్చిన రిషితో బోర్డు మీటింగ్ ఉంది కదా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మనసులో త్రాసు వేసుకున్నాను, త్రాసు మీ వైపే మొగ్గింది అందుకే మీతో కలిసి వెళ్లాలని వెయిట్ చేస్తున్నాను అంటుంది వసుధార. మనం ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే నిజంగానే లేట్ అవుతుంది అని కారు స్టార్ట్ చేస్తాడు రిషి. కారులో కూర్చున్న వసుధార మన ప్రయాణం ఎప్పుడూ ఇలాగే కొనసాగాలి అంటుంది. ప్రయాణం అనేది కాలం చేతిలో ఉంటుంది అంటాడు రిషి. నేను ఆశావాద దృక్పథంతో మాట్లాడుతున్నాను, మీరు వేదాంతం మాట్లాడుతున్నారు.
నేను అనేది మన ఇద్దరం ప్రయాణం చేసినన్నాళ్ళు ఇలాగే కలిసి ప్రయాణం చేయాలి అంటుంది వసుధార. ఆ తర్వాత క్లాసులో టీచింగ్ స్టార్ట్ చేస్తాడు రిషి. అప్పుడు స్టూడెంట్స్ మాట్లాడుతూ మీరు మాకు క్లాస్ తీసుకోవడం మా అదృష్టం సార్, మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు, ఇక ఈ కాలేజీకి అన్ని మంచి రోజులే అంటారు స్టూడెంట్స్. వాళ్లకి కృతజ్ఞతలు చెప్పి క్లాస్ తీసుకోవడం ప్రారంభిస్తాడు రిషి.
రిషితో పాటు రిటైర్డ్ లెక్చరర్స్ కూడా క్లాసులు తీసుకోవటం ప్రారంభిస్తారు. అప్పుడు కాలేజీ లెక్చరర్స్ వసుధార దగ్గరికి వచ్చి మీరు చేసిన పని ఏమీ బాగోలేదు, మేము యూనియన్ లో కంప్లైంట్ చేస్తాను అందరం స్ట్రైక్ చేస్తాము అంటారు. మేము ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు మీరు, మీరు స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు నేను ఎందుకు మీ గురించి ఆలోచించాలి అంటుంది వసుధార.
అప్పుడే అక్కడికి వచ్చిన రిషి కూడా మీరు ఏ యూనియన్ లో కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయింది మీరు అంటాడు. రిషి కోపంగా మాట్లాడుతుంటే కొంచెం తగ్గిన లెక్చరర్స్ లేదు సర్ మేము మళ్ళీ క్లాసులు తీసుకోవడం ప్రారంభిస్తాము, వచ్చిన లెక్చరర్స్ ని పంపించేయండి అంటాడు. మళ్లీ స్వార్థంతో ఆలోచిస్తున్నారు.
మీరు కావాలంటే క్లాసులు తీసుకోండి అంతేకానీ వాళ్ళని వెళ్లిపోమనటం భావ్యం కాదు. కొందరు జీతం కోసం పని చేస్తారు కొందరు ఆశయం కోసం పని చేస్తారు. మీరు మొదటి కేటగిరి అయితే వాళ్ళు రెండవ కేటగిరి. మీరు ఎలాగో మిషన్ ఎడ్యుకేషన్ పనులు, టీచింగ్ రెండూ చేయలేకపోతున్నాం అంటున్నారు కదా, మీ పని మీరు చేసుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు లెక్చరర్స్.
ఆ తర్వాత ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసినందుకు రిషి ని మెచ్చుకుంటుంది వసుధార. నిజానికి నువ్వు గ్రేట్ వసుధార, నువ్వు కూర్చున్న ఎండి సీట్ పదవి కాదు అది ఒక ముళ్ళ కిరీటం దాని కోసమే నామీద అటాక్స్ జరిగాయి, అయినప్పటికీ నేను చెప్పానని ఆ సీట్లో కూర్చున్నావు. నిజంగా నువ్వు గ్రేట్. మన ఇద్దరం ఇలాగే కలిసి విద్యారంగంలో పెను మార్పులు తీసుకురావాలి అంటాడు రిషి. సరే అంటుంది వసుధార.
ఇదంతా పక్క నుంచి చూస్తున్న శైలేంద్ర కోపంతో రగిలిపోతూ తల్లికి ఫోన్ చేస్తాడు. కొత్త లెక్చరర్స్ ని తీసుకువస్తాను అని స్టూడెంట్స్ కి చెప్తే పిల్లల్ని సముదాయిస్తున్నాడేమో అనుకున్నాను కానీ వీడు నిజంగానే లెక్చరర్స్ ని తీసుకొచ్చి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాడు అని టెన్షన్ తో చెమటలు కక్కుకుంటూ చెప్తాడు. రిషి అంటే ఏమనుకున్నావ్ అతనిని తక్కువగా అంచనా వేశావు అంటుంది దేవయాని.
మరోవైపు విష్ కాలేజీ ప్రిన్సిపల్ పాండ్యన్ ని పిలిచి రిషి సార్ వసుధార మేడం పెళ్లి చేసుకున్నారు అని చెప్పావు కదా వాళ్ళని గెస్ట్లుగా ఇక్కడికి పిలుద్దాము, ఎప్పుడు పిలుస్తాను అనేది నేను నీకు మళ్ళీ ఇంఫాం చేస్తాను. ఈ లోపు విశ్వనాథం సార్ కూడా వచ్చేస్తారు. వాళ్లని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే బాధ్యత నీదే అని చెప్తాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాండ్యన్.
మరోవైపు రెడీ అవుతున్న రిషి దగ్గరికి వచ్చి మీరు పాత రిషి సర్ లాగా లేరు పాత రిషి సార్ చాలా స్టైల్ గా ఉండి ఎప్పుడూ నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉండేవారు అంటుంది వసుధార. అందుకేనా నేను ఐ లవ్ యు చెప్తే రిజెక్ట్ చేసావు అడుగుతాడు రిషి. అవన్నీ ఇప్పుడు గుర్తు చేయొద్దు అంటుంది వసుధార. కానీ నాకు మాత్రం అవన్నీ గుర్తు చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అంటూ వసుధార ని దగ్గరకి తీసుకోబోతాడు.
ఇంతలో విష్ కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని తెలిసింది మీ ఇద్దరినీ కాలేజీకి ఇన్వైట్ చేస్తున్నాను తప్పకుండా రండి అని చెప్పాడు. అందుకు ఒప్పుకుంటాడు రిషి. ఆ తర్వాత రెడీ అయి వెళ్తున్న రిషి, వసుధారలని చూసి కాలేజీకి వెళ్తున్నారా అని అడుగుతాడు మహేంద్ర. అవును కానీ మన కాలేజీకి కాదు విష్ కాలేజీకి అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.