- Home
- Entertainment
- కాజ్వల్ వేర్‌లో థైస్ చూపిస్తూ లావణ్య త్రిపాఠి చిలిపి పోజులు.. సండే స్పెషల్ అదిరింది.. నిహారికా స్పందించింది
కాజ్వల్ వేర్‌లో థైస్ చూపిస్తూ లావణ్య త్రిపాఠి చిలిపి పోజులు.. సండే స్పెషల్ అదిరింది.. నిహారికా స్పందించింది
`అందాల రాక్షసి` లావణ్య త్రిపాఠి చూడ్డానికి క్యూట్ లుక్‌లో, ట్రెడిషనల్‌గా కనిపించినా ఆమెలో అన్‌లిమిటెడ్ హాట్ నెస్ దాగుంది. అయితే దాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీస్తుండటం విశేషం.

లావణ్య త్రిపాఠి(lavanya Tripathi) మొదట్లో ఎంతో సాంప్రదాయంగా కనిపించింది. స్కీన్ షోకి దూరంగా ఉంటూ వచ్చింది. హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ ఈ మధ్య కాలంలో గ్లామర్ షోకి గేట్లు ఎత్తేసింది. అందాల విందు వడ్డిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
అందులో భాగంగా ఈ సండే స్పెషల్‌గా(Lavanya Sunday Special Pics) కాజ్వల్ లుక్‌లో కనిపించింది లావణ్య త్రిపాఠి. వైట్ టీషర్ట్, పొట్టి షాట్ ధరించింది. సరదాగా ఉయ్యాల ఊగుతూ ఆమె ఇచ్చిన చిలిపి పోజులు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ సైతం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. `స్మైల్, బ్రీత్ అండ్ గో స్లోలీ` అని పేర్కొంది. ఈ సందర్భంగా లావణ్య ఫోటోలకు ఆమె అభిమానులు, సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతున్నారు. అందులో భాగంగా నిహారికా స్పందించింది. `క్యూటెస్ట్` అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.
లావణ్య త్రిపాఠి ఇటీవల `హ్యాపీ బర్త్ డే` చిత్రంతో మెరిసింది. గన్ కల్చర్ నేపథ్యంలో సెటైరికల్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో లావణ్య ప్రధాన పాత్ర పోషించడం విశేషం. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో తీవ్ర నిరాశలోకి వెళ్లింది లావణ్య త్రిపాఠి.
ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి కెరీర్‌లో సరైన బ్రేక్ లేదు. `భలేభలే మగాడివోయ్`, `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కానీ ఆ క్రెడిట్ హీరోలు, దర్శకులకే వెళ్లింది. ఆ తర్వాత చేసిన పది సినిమాలు పరాజయం చెందాయి.
లావణ్య త్రిపాఠి సినిమాల్లో కేవలం గ్లామర్‌కే పరిమితం కాదు. తన పాత్రకి కూడా ప్రయారిటీ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటుంది. నటన పరంగానూ మెప్పించినా అల్టీమేట్‌గా సక్సెస్ మాట్లాడుతుంది. విజయాలు లేకపోవడంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం గమనార్హం. తమిళంలో ఓ మూవీకి కమిట్ అయ్యిందట.