- Home
- Entertainment
- లావణ్య త్రిపాఠి అందాల రాజహంసలా మెరిసిపోతూ హాట్ పోజులు.. గ్రీన్ శారీలో ఇలా చూస్తే కుర్రాళ్లకి దేత్తడే!
లావణ్య త్రిపాఠి అందాల రాజహంసలా మెరిసిపోతూ హాట్ పోజులు.. గ్రీన్ శారీలో ఇలా చూస్తే కుర్రాళ్లకి దేత్తడే!
లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని అలరిస్తుంది. ఒకప్పుడు పద్ధతిగా మెరిసే లావణ్య త్రిపాఠి రాను రాను తను కూడా గ్లామర్ బ్యూటీలా మారిపోతుంది. రచ్చ చేస్తుంది.

అందాల రాక్షసి.. లావణ్య త్రిపాఠి తాజాగా అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో, ఆకుపచ్చని శారీ కట్టి కత్తిలాంటి పోజులిచ్చింది. మెడలో హారం ధరించి కాస్త అమాయకత్వంగా, ఇంకాస్త హాట్‌గా కనిపిస్తుంది. సీట్లో కూర్చొని రాజహంసలా పోజులివ్వగా ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో ఓ పోస్ట్ పెట్టింది లావణ్య త్రిపాఠి.. జీవితం ఒక పార్టీ లాంటిదని, అందులో భాగంగా తాను గ్రీన్ ధరించినట్టు తెలిపింది. పార్టీలకు గ్రీన్ దుస్తులు యాప్ట్ అనేది తన ఉద్దేశ్యమని లావణ్య చెప్పింది. ప్రస్తుతం లావణ్య నయా లుక్ అభిమానులను కట్టిపడేస్తుంది.
లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా జోరు తగ్గింది. ఆమె గతేడాది `హ్యాపీ బర్త్ డే` చిత్రంలో నటించింది. ఇది బోల్తా కొట్టింది. దీంతో లావణ్యకి సినిమాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తుంది లావణ్య. దీంతో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండటం లేదు.
`అందాల రాక్షసి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. కాస్త ఇన్నోసెంట్, ఇంకాస్త బోల్డ్ గా ఉండే పాత్రలో మెప్పించింది. `నాకు పెళ్లి చేయండి నాన్న, ఉండలేకపోతున్నా` అంటూ ఆమె చెప్పిన డైలాగ్ హైలైట్ అయ్యింది. వైరల్‌గా మారింది. దీంతో ఒక్క దెబ్బతో లావణ్య పాపులర్ అయ్యింది.
ఆ తర్వాత లావణ్య త్రిపాఠికి వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా తెలుగు, తమిళంలో సినిమాలు చేసింది. తెలుగు `దూసుకెళ్తా`, తమిళంలో `బ్రామ్మన్`, మళ్లీ తెలుగులో `భలే భలే మగాడివోయ్`, `సోగ్గాడే చిన్ని నాయన`, `లచ్చిందేవికి ఓ లెక్కుంది`, `శ్రీరస్తు శుభమస్తు`, `మిస్టర్`, `రాధ`, `యుద్ధం శరణం`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `ఇంటలిజెంట్`, `అంతరిక్షం`, `అర్జున్ సురవరం`, `ఏ1ఎక్స్ ప్రెస్`, `చావు కబురు చల్లగా`, `హ్యాపీ బర్త్ డే` చిత్రాలు చేసింది.
Lavanya Tripathi
ప్రారంభంలో విజయాలు అందుకున్న లావణ్యకి రాను రావు పరాజయాలు క్యూ పెరిగింది. దీంతో ఈ బ్యూటీకి క్రేజ్, డిమాండ్ తగ్గుతూ వస్తోంది. సరైన హిట్ పడితే నెక్ట్స్ లెవల్ హీరోయిన్ అయ్యేది. కానీ ఇప్పటి వరకు ఆ హిట్ దక్కలేదు ఈ బ్యూటీకి. దీంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
ఇదిలా ఉంటే వరుణ్ తేజ్‌తో లవ్ ఎఫైర్ అంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి `మిస్టర్`, `అంతరిక్షం` చిత్రంలో నటించారు. దీంతో ప్రేమ పుట్టిందని, పెళ్లి వరకు వెళ్లిందని, ఎంగేజ్‌మెంట్‌కి కూడా ప్లాన్ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే అందులో నిజం లేదని లావణ్య స్పందించడం గమనార్హం.