MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదొక డిఫరెంట్‌ ఫీలింగ్‌.. మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లడంపై లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు..

అదొక డిఫరెంట్‌ ఫీలింగ్‌.. మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లడంపై లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు..

లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది. మెగా కోడలిగా ఓ పెద్ద బాధ్యతని మోస్తుంది. తాజాగా కొణిదెల ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లడానికి సంబంధించిన ఫీలింగ్‌ గురించి చెప్పుకొచ్చింది లావణ్య.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 02 2024, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్‌ తేజ్‌ని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా ఫ్యామిలీకి ఎంట్రీ ఇవ్వడం తనలో కలిగిన ఫీలింగ్స్ ఏంటో చెప్పింది లావణ్య. లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ గతేడాది నవంబర్‌ 1న ఇటలీలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళైన కొన్ని రోజులు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌ కే పరిమితమయ్యారు. కొన్ని రోజులు హనీమూన్‌ వెళ్లారు. ఇప్పుడు జస్ట్ మూడు నెలల్లోనే కెరీర్‌పై ఫోకస్‌ పెట్టారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు లావణ్య త్రిపాఠి `మిస్‌ పర్‌ఫెక్ట్` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మీడియాతో ముచ్చటించింది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వరుణ్‌ తేజ్‌తో మ్యారేజ్‌ తర్వాత తన జీవితం ఏం మారలేదని తెలిపింది. అంతకు ముందు ఎలా ఉన్నానో, ఇప్పుడు కూడా అలానే ఉన్నట్టు చెప్పింది. తనకు ఇంట్లో ఎలాంటి రిస్టిక్షన్స్ పెట్టలేదని, తనకు ఆ స్వేచ్ఛ ఉందని తెలిపింది. 
 

36

`మెగా కుటుంబంలోకి వచ్చాక నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి అని నాకు ఎవరూ చెప్పడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ లాంటి అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ ఉన్నాడు. మిగతా వాళ్లు నన్ను చూసే విధానంలో తేడా ఉందేమో. మా వరకు గతంలో లాగే ఉన్నాం. `మెగా ఫ్యామిలీ` అనే ఒక పెద్ద ఫ్యామిలీలోకి అడుగుపెట్టడం గుడ్ ఫీలింగ్ ఇచ్చింది` అని చెప్పింది లావణ్య త్రిపాఠి. `మిస్ పర్ఫెక్ట్` సిరీస్ ను వరుణ్ చూసి మంచి క్వాలిటీతో బాగుందని చెప్పాడు. వరుణ్, నేను ఎవరి ప్రొఫెషనల్ వర్క్ వాళ్లం ముందుకు వెళ్తాం. నేను చేసే ప్రాజెక్ట్స్ లో తను ఇన్వాల్వ్ కాడు. నేను ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ గురించి చెబితే వింటాడని చెప్పింది.  
 

46

``మిస్ పర్ఫెక్ట్` సిరీస్ రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసిన గుడ్ స్క్రిప్ట్ ఇది. ఇలాంటి స్క్రిప్ట్ నాకు రావడం హ్యాపీగా ఉంది. ఇందులో రెగ్యులర్ గా చూసే కామెడీ ఉండదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి.  ఈ వెబ్ సిరీస్ లో నేను మిస్ లావణ్య, లక్ష్మీ అనే క్యారెక్టర్స్ లో నటించాను. ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. అలా ప్రతి పనిలో పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం కొన్ని ఇబ్బందులు తీసుకొస్తుంది. ఈ క్యారెక్టర్స్ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి.

56

 ఒక నటిగా నేను భిన్నమైన రోల్స్ చేయాలని కోరుకుంటాను. ఆ క్రమంలో నాకు "మిస్ పర్ఫెక్ట్" లో చేసే ఛాన్స్ దక్కింది. ఇందులో నటించిన మిస్ లావణ్య, లక్ష్మీ క్యారెక్టర్స్ నా పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ఉంటాయి. నేను రియల్ లైఫ్ లో కొద్దిగా ఈ క్యారెక్టర్స్ తో రిలేట్ చేసుకోగలను. ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీలా ఉంటాను. సెట్ లో లావణ్య క్యారెక్టర్ లా పర్పెక్షన్ కోరుకుంటాను` అని తెలిపింది.

66

కొత్త ప్రాజెక్ట్ ల గురించి చెబుతూ, `కొత్త హీరోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా ఫినిష్ చేశాను. అందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. ఒక తమిళ్ మూవీ చేస్తున్నా` అని చెప్పింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఆమె ఓవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూనే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలిపింది.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Vijay: విజయ్‌ని వదలని త్రిష, స్పెషల్ బర్త్‌డే పోస్ట్.. అదిరిపోయే ఫోటోతో కౌంటర్‌
Recommended image2
Top 10 Heroines: సమంత ఈజ్‌ బ్యాక్‌, సాయిపల్లవి, శ్రీలీలకు షాక్‌.. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Recommended image3
Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved