- Home
- Entertainment
- వరుణ్ తో ఎంగేజ్మెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా లావణ్య త్రిపాఠి చీర, ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
వరుణ్ తో ఎంగేజ్మెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా లావణ్య త్రిపాఠి చీర, ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
సెలబ్రిటీల బట్టలు, వాళ్లు వాడే వస్తువులపై.. నెటిజన్ల కన్ను ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఏదైనా అకేషన్ ఉంటే చాలు.. ఇక తెల్లారి వారి గురించి.. వారు వాడిన వస్తువుల గురించి ఏదో ఒక న్యూస్ రావాల్సిందే. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థంలో.. లావణ్య కట్టుకున్న పట్టు చీర ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని...పెద్దవాళ్ళను ఒప్పించి మరీ.. పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఈనెల 9న వీరిద్దరి నిశ్చితార్థం సింపుల్ గా.. ఓమోస్తరు ఘనంగా.. జరిగింది. హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలో అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ తమ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
Varun Tej-Lavanya Tripathi Engagement
అయితే అంతా బాగానే ఉంది.. ఇక సోషల్ మీడియా మాత్రం ఊరుకోదు కదా.. ఈ వేడుకల్లో ఎవరి డ్రస్సులెలా ఉన్నాయి. ప్రత్యేక ఆకర్శణ ఎవరు.. కాస్లీ డ్రస్ లపై ఆరా తీయగా..పెళ్లి కూతురు లావణ్య త్రిపాఠి కట్టుకున్న పట్టుచీర ప్రత్యేకంగా కనిపించింది. లైట్ గ్రీన్ కలర్ పట్టు చీరను ఆమె ఈవేడుకల కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్టు తెలుస్తోంది. ఇక ఆకంపెనీ కాడా ఈ చీరకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
Varun Tej - Lavanya Tripathi engagement
ఒక రకంగా చూస్తే.. సెలబ్రిటీలు ఎక్కువ రేట్లు ఉన్న బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు. ఇక ఏదైనా పార్టీలు, ఫంక్షన్లు ఉన్నాయంటే.. మరింత ప్రత్యేకంగా ఉండాలని.. ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉన్న వాటిని వేసుకుంటారు. గతంలో చాలా మంది ఇలా ఫాలో అయినవారు ఉన్నారు. గతంలో చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్స్ ఎక్కువ ధర ఉన్న బట్టలే వేసి వైరల్ గా మారారు. కొంతమంది అయితే లక్షల్లో విలువ చేసే చీరలు కట్టారు. ఇప్పుడు లావణ్య కట్టిన చీర ధర కూడా వైరల్ గా మారింది.
వరుణ్ తో జరిగిన నిశ్చితార్థంలో లావణ్య కట్టిన చీర ధర ఏకంగా 75 వేల రూపాయలు.ఈ చీరను లావణ్య త్రిపాటికి అందించిన ఓ ఫ్యాషన్ డిజైనర్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ పట్టు చీర మెరిసిపోతుండగా లావణ్య ఇందులో మరింత అందంగా కనిపించింది. అయితే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చీరల ధరతో పోలిస్తే ఇది తక్కువే అని పలువురు కామెంట్స్ చేస్తుండగా... పెళ్లికి లక్షల్లో కాస్త్ పెట్టి కొంటుందిలే అని మరికొందరు సమర్థిస్తున్నారు. మొత్తానికి లావణ్య చీర హాట్ టాపిక్ అవుతోంది.
Varun Tej - Lavanya Tripathi engagement
ఇక వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం వేడుక ఎంతో సందడిగా జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ వేడుకల్లో సందడి చేయగా.. నిహారిక ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. అంతే కాదు వెల్కం వదినా అంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ కూడా పెట్టింది. అటు మెగా అభిమానులు కూడా మెగా కోడలికి వెల్కం చెపుతున్నారు.