MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆమెని ప్రైవేట్ గా ముద్దు పెట్టుకుంటూ, హీరోయిన్ ఫోటో బయటపెట్టిన లావణ్య..హైకోర్టులో రాజ్ తరుణ్ పిటిషన్

ఆమెని ప్రైవేట్ గా ముద్దు పెట్టుకుంటూ, హీరోయిన్ ఫోటో బయటపెట్టిన లావణ్య..హైకోర్టులో రాజ్ తరుణ్ పిటిషన్

యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం పెను తుఫాన్ లాగా మారుతోంది. రాజ్ తరుణ్ కి తీవ్రమైన చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. దాదాపు దశాబ్దం పైగా వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 01 2024, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం పెను తుఫాన్ లాగా మారుతోంది. రాజ్ తరుణ్ కి తీవ్రమైన చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. దాదాపు దశాబ్దం పైగా వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు. ఆమెతో శారీరకంగా సంబంధం ఉన్న మాట వాస్తవమే అని రాజ్ తరుణ్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నాడు. అయితే కొందరి వల్ల రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదని లావణ్య ఆరోపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ వివాదం జరిగిన తర్వాత తొలిసారి రాజ్ తరుణ్ తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. తన వద్ద అన్నీ అధరాలు ఉన్నాయని, తాను ఏ తప్పు చేయలేదని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. కాగా నేడు ఈ కేసులో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 

36

లావణ్య. రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనితో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ ని విచారణకి రావాలని ఆదేశించారు. మరోవైపు రాజ్ తరుణ్ తన భర్త అని.. రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు అంటూ లావణ్య మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ కేసు మరింతగా ముదురుతుండడంతో నేడు రాజ్ తరుణ్ హైకోర్టుని ఆశ్రయించాడు. 

46
Raj Tarun and Lavanya

Raj Tarun and Lavanya

పోలీసులు విచారణకు పిలవడంతో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పిటిషన్ ని హైకోర్టు విచారణ చేపట్టింది. కేసు గురించి పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు నార్సింగ్ పోలీసులని ఆదేశించింది. విచారణని రేపటికి వాయిదా వేశారు. 

56

అయితే మరోవైపు లావణ్య సంచలన ఆరోపణలు చేస్తూ మీడియాలో పెను సంచలనంగా మారింది. ఓ మీడియా సంస్థలో లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రైవేట్ గా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో బయట పెట్టింది. ఆమె ఎవరు అని మీడియా అడగగా.. ఎవరో తెలియదు.. మీరే చూడండి అని ఫోటో చూపించింది. 

66

ఆమె ఇద్దరిలోకం ఒకటే అనే చిత్రంలో నటించింది అని పేర్కొంది. తనపై రాజ్ తరుణ్ తరుపున వాళ్ళు డ్రగ్స్ ఆరోపణలు చేస్తుండడంతో లావణ్య కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బయట పెడతానని లావణ్య చెబుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved