- Home
- Entertainment
- రాజ్ తరుణ్ తో బిగ్ బాస్ అరియానా ఎఫైర్, రోజుకి 50 వేలు అంటూ సంచలనం..లావణ్య ఎలా కనిపెట్టిందో తెలుసా
రాజ్ తరుణ్ తో బిగ్ బాస్ అరియానా ఎఫైర్, రోజుకి 50 వేలు అంటూ సంచలనం..లావణ్య ఎలా కనిపెట్టిందో తెలుసా
రాజ్ తరుణ్ తనకి కావాలని, ఇప్పటికీ అతడిని ప్రేమిస్తున్నాని లావణ్య మీడియా ముఖంగా బోల్డ్ గా చెబుతున్నారు. రాజ్ తరుణ్ తో ఆడియో కాల్స్.. చాటింగ్ ఇలా పలు ఆధారాలని లావణ్య బయట పెడుతున్నారు.
- FB
- TW
- Linkdin
- GNFollow Us

Raj Tarun and Lavanya
యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం పెను తుఫాన్ లాగా మారుతోంది. రాజ్ తరుణ్ కి తీవ్రమైన చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. దాదాపు దశాబ్దం పైగా వీళ్ళిద్దరూ సహజీవనం చేశారు. ఆమెతో శారీరకంగా సంబంధం ఉన్న మాట వాస్తవమే అని రాజ్ తరుణ్ కూడా మీడియా ముందు ఒప్పుకున్నాడు. అయితే కొందరి వల్ల రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదని లావణ్య ఆరోపిస్తోంది.
Raj Tarun and Lavanya
రాజ్ తరుణ్ తనకి కావాలని, ఇప్పటికీ అతడిని ప్రేమిస్తున్నాని లావణ్య మీడియా ముఖంగా బోల్డ్ గా చెబుతున్నారు. రాజ్ తరుణ్ తో ఆడియో కాల్స్.. చాటింగ్ ఇలా పలు ఆధారాలని లావణ్య బయట పెడుతున్నారు. అన్నింటికంటే సంచలనం రేపుతున్నది, రాజ్ తరుణ్ ని చిక్కుల్లో నెడుతున్న అంశం మరొకటి ఉంది.
లావణ్యకి రాజ్ తరుణ్ రెండు సార్లు అబార్షన్ చేయించాడట. వాటికి సంబందించిన ఆధారాలని కూడా లావణ్య బయటపెట్టారు. రాజ్ తరుణ్ కూడా లావణ్యపై ఆరోపణలు చేస్తున్నారు. లావణ్య మాత్రం మీడియాకి ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత సంచలనం చేస్తున్నారు.
Ariyana glory
కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల రాజ్ తరుణ్ తనని పట్టించుకోవడం లేదని లావణ్య తెలిపింది. ఆ హీరోయిన్ల పేర్లు కూడా చెప్పింది. షాలిని పాండే, రిద్దీ కుమార్, మాల్వి మల్హోత్రా తో పాటు బిగ్ బాస్ అరియానా కూడా అని తెలిపింది.
రాజ్ తరుణ్ తో అరియానా ఎఫైర్ పెట్టుకున్నట్లు మీకు ఎలా తెలిసింది అని యాంకర్ ప్రశ్నించగా లావణ్య సమాధానం ఇచ్చింది. అరియానాతో ఎఫైర్ మొదలయ్యాక రాజ్ ఇంటికి వచ్చేవాడు కాదు. అరియానా నాతో ప్రవర్తించే విధానం కూడా మారింది. ఒక అమ్మాయి ఏం చేస్తోందో మరో అమ్మాయిగా నాకు అర్థం అవుతుంది.
Raj Tarun and Lavanya
మణికొండలో అరియానా ఉంటున్న అపార్ట్మెంట్ కి రాజ్ వెళ్ళేవాడు. అపార్ట్మెంట్ లో వాళ్లే నాకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళిద్దరి ఫోటోలు కూడా నేను చూసాను. ఒకరోజు నేను గోవాలో ఉండగా రాజ్ ఫోన్ నుంచి నాకు అరియనా కాల్ చేసింది. చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడింది. నీకు జీతం ఎంత వస్తుంది అని అడిగింది..ఇదే బిగినింగ్ కదా తక్కువ వస్తుంది అని చెప్పా.. అవునా.. నాకైతే రోజుకి 50 వేల నుంచి లక్ష వరకు వస్తుంది అంటూ తక్కువ చేసి మాట్లాడింది.
అప్పుడే నాకు అర్థం అయింది.. నాకు కౌంటర్ ఇవ్వడానికి రాజ్.. అరియానాని వాడుకున్నాడు అని అంటూ లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత నేను అరియానా కి వార్నింగ్ ఇచ్చాను. దీనితో అరియానా నాకు సారీ కూడా చెప్పింది. ఆ కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని లావణ్య షాకిచ్చింది.