MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Latha Mangeshkar:బాలుతో లతాజీకి ప్రత్యేక అనుభందం... వీరి కాంబినేషన్లో వచ్చిన ఆ రెండు చిత్రాల సాంగ్స్ అజరామరం

Latha Mangeshkar:బాలుతో లతాజీకి ప్రత్యేక అనుభందం... వీరి కాంబినేషన్లో వచ్చిన ఆ రెండు చిత్రాల సాంగ్స్ అజరామరం

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Latha Mangeshkar Pasess Away) మరణం ఆమె అభిమానులను, కుటుంబ సభ్యులను శోకసముద్రంలో ముంచివేసింది. కరోనా మహమ్మారి లతాజీని అందరికీ దూరం చేసింది. లతాజీ ఈ లోకాన్ని విడిచిపోయినా.. ఆమె పాటల నిధి పదిలంగా ఉంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 06 2022, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మధుర గానంతో  రోజూ పలకరించనున్నారు. సింగర్ గా తిరుగులేని చరిత్ర లిఖించిన లతాజీ పాటల పల్లకిలో సుదూరాలకు ఏగిపోయారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో లతా మంగేష్కర్ వేల సంఖ్యలో పాటలు పాడారు . అలాగే దేశంలోని అనేక మంది సింగర్స్ తో గొంతుకలిపారు. ముఖ్యంగా మన తెలుగు గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యంతో లతాజీకి ప్రత్యేక అనుభందం వుంది. పదుల సంఖ్యలో తెలుగు, హిందీ పాటలు కలిసి పాడారు. 

26

వీరి కాంబినేషన్ లో వచ్చిన పాటల్లో మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే కౌన్ హై ఆల్బమ్స్ చాలా ప్రత్యేకం. సల్మాన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన ఈ రెండు చిత్రాల సాంగ్స్ అప్పట్లో సంగీత ప్రియులను మెస్మరైస్ చేశాయి. ముఖ్యంగా మైనే ప్యార్ కియా మూవీ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. 

36

ఈ రెండు చిత్రాలకు మ్యూజిక్ రామ్ లక్ష్మణ్ అందించారు. ఆలాగే ఆల్బమ్ లోని మొత్తం పాటలు లతాజీ-ఎస్పీ బాల సుబ్రమణ్యం చేత పాడించారు. హిందీతో పాటు తెలుగులో కూడా లతాజీ-బాలు పాడారు. 
 

46

తెలుగులో ప్రేమ పావురాలు, ప్రేమాయలయం అంటే టైటిల్స్ లో విడుదలయ్యాయి. ప్రేమ పావురాలు సాంగ్స్ తెలుగులో కూడా అతిపెద్ద హిట్. మ్యూజిక్ ప్రియులను దశాబ్దాల పాటు అలరించిన సాంగ్స్ అవి. ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపించే ఆ సినిమా పాటలు సినిమా విజయంలో కీలకంగా మారా

56


తెలుగులో కూడా ప్రేమపావురాలు మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అలాగే హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రం ప్రేమాలయం టైటిల్ తో విడుదలై అతిపెద్ద విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ కాగా.. లతాజీ-బాలు తమ గాత్రంతో మాయ చేశారు. 

66

ఒక దశలో బాల సుబ్రహ్మణ్యం(SP Balasubramanyam) కి గొంతు సమస్య వచ్చింది. డాక్టర్స్ సర్జరీ సూచించారు. ఈ విషయాన్నీ లతాజీకి బాలు చెప్పారట. దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన వాయిస్ పాడవుతుంది, సర్జరీ వద్దని లతాజీ సలహా ఇచ్చారట. ఆవిడ మాటకు సరే చెప్పిన బాలు, తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారట. అంతగా ఒకరినొకరు గౌరవించుకోవడం, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునేవారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dubai: దుబాయ్‌లో ఏడ్చింది, ఇప్పుడు బికినీలో రచ్చ.. సోనాల్ చౌహాన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు
Recommended image2
Kasthuri Shankar: కర్మ వడ్డీతో సహా ఇచ్చేస్తుంది.. ఆ డైరెక్టర్‌కు అదే జరిగింది!
Recommended image3
Vijay Trisha: విజయ్‌ ఆ హీరోని చూసి నేర్చుకోవాలి.. దళపతిపై నెటిజన్ల సెటైర్లు, ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved