MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్: వెన్నెల కిశోర్ నటించిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్: వెన్నెల కిశోర్ నటించిన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

\ వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

1 Min read
Author : Galam Venkata Rao
Published : Jan 24 2025, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
vennela kishore,  Srikakulam Sherlock Holmes, OTT

vennela kishore, Srikakulam Sherlock Holmes, OTT

తెలుగు ప్రేక్షకులను తమ కామెడీతో ఆకట్టుకుంటున్న వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేశారు. విడుదలకు ముందే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో ఈ సినిమాకు 7.5 రేటింగ్ వచ్చింది, ఇది చాలా గొప్ప విషయమని చెప్పాలి.

ఈ సినిమాలో వెన్నెల కిశోర్ తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ, డిటెక్టివ్ పాత్రలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో బ్రహ్మానందం తర్వాత కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడుగా పేరు తెచ్చుకున్న వెన్నెల కిశోర్, ఈ సినిమాలో కూడా తన సత్తా చూపించాడు. వెన్నెల కిశోర్ కు జోడీగా నటించిన అనన్య నాగళ్ల కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఇంకా ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం, 'నేనింతే' ఫేమ్ సియా గౌతమ్, కాలకేయ ప్రభాకర్, మురళీ ధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. 'కమిటీ కుర్రోళ్లు', 'ఆయ్', 'క' వంటి విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేశారు.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచక్కా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేస్తూ చూడండి. విడుదలైన కేవలం నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: శోభన్ బాబు పిసినారి కాదు.. ఎస్పీ బాలు, కృష్ణంరాజు చెప్పిన షాకింగ్ విషయాలు
Recommended image2
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved