MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lata Mangeshkar: లతా మంగేష్కర్‌పై హత్యాయత్నం.. విష ప్రయోగం.. ఏం జరిగిందంటే?

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌పై హత్యాయత్నం.. విష ప్రయోగం.. ఏం జరిగిందంటే?

లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌కు అత్యంత సన్నిహితుడైన పద్మ సచ్‌దేవ్‌.. లతా జీవితంపై ఓ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలోనే తొలిసారిగా లతా మంగేష్కర్‌కు స్లో పాయిజన్‌ ఇచ్చారన్న విషయాన్ని వెల్లడించారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 06 2022, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగా కీర్తించబడుతున్న అద్భుతమైన గాయని లతా మంగేష్కర్‌పై హత్యాయత్నం జరిగింది. అందుకోసం ఏకంగా స్లో పాయిజన్‌ ఇచ్చారు. మరి లతాని ఎందుకు చంపాలనుకున్నారు, ఆమెపై ఎలాంటి హత్యాయత్నం జరిగిందనేది చూస్తే. భారతీయ సంగీతంలోని నేపథ్యగానంతో విశేష సేవలందించి లెజెండరీ గాయనిగా నిలిచారు లతా మంగేష్కర్‌. తన జీవితాన్ని పూర్తిగా సంగీతానికే అంకితం చేశారు ఈ మహాగాయని.
 

25

లెజెండరీ గాయని లతా మంగేష్కర్‌కు అత్యంత సన్నిహితుడైన పద్మ సచ్‌దేవ్‌.. లతా జీవితంపై ఓ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలోనే తొలిసారిగా లతా మంగేష్కర్‌కు స్లో పాయిజన్‌ ఇచ్చారన్న విషయాన్ని వెల్లడించారు. లతా నేపథ్య గాయనిగా 50వేలకుపైగా పాటలను ఆలపించారు.  భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గాను ఆమెను నైటింగేల్‌ ఆఫ్ ఇండియా అంటూ కీర్తిస్తారు. భారత రత్న సాధించిన ఈ మహా గాయనిని ఒక దశలో కొందరు వ్యక్తులు హత్య చేసేందుకు ప్రయత్నించారట.

35

లతాజీ జీవితం ఆధారంగా రాసిన ఐసా కహన్‌ సే లావూన్‌ పుస్తకంలో తొలిసారిగా లతాజీ మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి వివరించాడు. 1963లో ఆమె మీద ఈ కుట్ర జరిగినట్టుగా వెల్లడించాడు. అయితే దేవుడి దయ వల్ల ఆమెకు ఏమీ జరగలేదని తెలిపారు. పద్మ సచ్‌దేవ్ చెప్పిన లతాజీ స్వయంగా తన మీద జరిగిన హత్య ప్రయత్నం గురించి తనతో చెప్పారని వెల్లడించాడు.

45

తన 33 ఏళ్ల వయసులో అంటే 1963లో లతాజీకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రెండు మూడు సార్లు పచ్చ రంగులో వాంతులు కూడా  అయ్యాయి. ఆ సమయంలో లతా తన చేతులు కూడా కదిలంచలేకపోయారు. ఒల్లంతా తీవ్రమైన నొప్పులు వచ్చాయి. మూడు రోజుల పాటు మరణానికి చేరువగా ఉన్న ఆమె ట్రీట్‌మెంట్‌ ద్వారా ఆరోగ్యం మెరుగుపడింది. కొంత కాలానికి ఆమె పూర్తిగా కోలుకున్నారు. 

55

ఆ సమయంలో డాక్టర్లు ఆమెతో స్లో పాయిజన్‌ కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే లతా మంగేష్కర్‌ వంట మనిషిని తొలగించారు. అతను కూడా కనీసం జీతం తీసుకోవడానికి కూడా రాకుండా వెళ్లిపోయాడని పద్మ  సచ్‌దేవ్ తన పుస్తకంలో వెల్లడించారు. దీంతో కొంత కాలం పాటు లతా తినే ఆహారాన్ని పరీక్షించిన తరువాత ఆమెకు వడ్డించారు. ఎక్కువగా లిరిసిస్ట్  మజ్‌రూహ్‌ సుల్తాన్‌పురీ ఆమె ఆహారాన్ని పరీక్షించేవారట. గతంలో ఓ లండన్ బేస్డ్‌ సినీ రచయితకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా లతా మంగేష్కర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Disasters: నిర్మాతలను ముంచేసిన టాలీవుడ్‌ టాప్‌ 5 డిజాస్టర్లు ఇవే
Recommended image2
Superstar krishna: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు, డైరెక్టర్‌ చనిపోయాడు, అయినా కృష్ణ తగ్గలేదు.. ఇండస్ట్రీ రికార్డులన్నీ షెడ్డుకి
Recommended image3
50 ఏళ్ల మహేష్ బాబు హీరోయిన్, 50 కోట్ల ఆస్తులు.. సిమ్రాన్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved