- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నిజం తెలుసుకుని నిర్ధాంత పోయిన దివ్య.. విక్రమ్ ని ఆయుధంలా మారుస్తున్న బసవయ్య!
Intinti Gruhalakshmi: నిజం తెలుసుకుని నిర్ధాంత పోయిన దివ్య.. విక్రమ్ ని ఆయుధంలా మారుస్తున్న బసవయ్య!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. అత్తింట్లో ఏదో జరుగుతుంది.. కానీ ఏం జరుగుతుందో తెలుసుకోలేక అయోమయంలో ఉన్న ఒక కొత్త కోడలి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కానీ చెప్పలేకపోతున్నావు అసలు ఏం జరుగుతుందో చెప్పు అంటుంది దివ్య. చెప్పగలిగితే నేను చెప్తాను కదా.. నేను మీ అంత చదువుకోలేదు నా కుటుంబం మీ కుటుంబం అంతా పెద్దది కూడా కాదు ఒక్కసారిగా ఈ బంగ్లాలోకి వచ్చి పడేసరికి ఊపిరాడటం లేదు. ఈ ఇంటి డోర్ మేట్ అంత కూడా ఉండదు నా బ్రతుకు అంటుంది ప్రియ. అదంతా గతం ఇప్పుడు మనం ఇద్దరం ఈ ఇంటి కోడళ్ళమే ఉంటుంది దివ్య.
.
చెట్టుకి ఉన్న పువ్వుకి చెట్టు నుంచి రాలిపోయిన పువ్వుకి ఉన్నంత తేడా ఉంది మన ఇద్దరికీ అంటుంది ప్రియ. నీ ప్రాబ్లం సంజయ్ అయితే చెప్పు నేను అత్తయ్యతో మాట్లాడుతాను అంటుంది దివ్య. మీ పోరాటం మీది..నా పోరాటం నాది దయచేసి నన్ను ఇంతకుమించి ఇబ్బంది పెట్టొద్దు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ప్రియ. మరోవైపు లాస్య ఫోన్ చేసిందా జరిగిన గొడవ గురించి నాకు భయంగా ఉంది అంటుంది అనసూయ. నీకెందుకు నువ్వేమీ భయపడొద్దు అంటాడు నందు. దివ్య దగ్గరికి వెళ్లి వస్తానంటూ బయలుదేరుతుంది తులసి.
అక్కడికి వెళ్లొద్దు.. రాజ్యలక్ష్మి గురించి అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ప్రతిదీ అనుమానిస్తావు. వచ్చేటప్పుడు మనసు కష్టపెట్టుకొని వస్తావు అంటాడు నందు. కూతురు కష్టంలో ఉందని తెలిసి చూస్తూ ఊరుకోలేకపోతున్నాను తనని చూసి తీరాల్సిందే అంటుంది తులసి. అయితే నేను వస్తాను నాకు కూడా దివ్యని చూడాలని ఉంది. ఇప్పటికే లాస్య ఇక్కడ జరిగిన గొడవ గురించి అక్కడ చెప్పేసి ఉంటుంది అంటాడు నందు. అందరికీ అన్ని తెలిసినా తేలు కుట్టిన దొంగల్లా కామ్ గా వుండటం తప్పితే ఎవరిమీ ఏమి చేయలేము తులసి.
ఇందులో పోలీసులు వచ్చి క్లాస్ అని మీరు ఇబ్బంది పెట్టినందుకు ఆమె కంప్లైంట్ ఇచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అంటారు. అరెస్టు అంటున్నారు నువ్వేమీ మాట్లాడవేమి అంటూ కంగారుగా తులసి తో చెప్తుంది అనసూయ. ఇది వాళ్ళ భార్య భర్తల వ్యవహారం నేనేం మాట్లాడేది అంటుంది తులసి.తులసి ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ పోలీసులతోపాటు బయలుదేరుతాడు నందు. మరోవైపు ఫస్ట్ నైట్ కోసం దివ్యని ముస్తాబు చేస్తూ ఉంటారు రాజ్యలక్ష్మి వాళ్ళు.
నీ కోడళ్ళు అదృష్టవంతులు నీలాంటి మంచి అత్తగారు దొరికింది అంటుంది బసవయ్య భార్య. ఆ మాట నువ్వు కాదు నా కోడలు చెప్పాలి అంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు విక్రమ్ తాతగారు బెడ్ ని అలంకరిస్తూ ఉంటారు. నీ బెడ్ ని ఇంత బాగా అలంకరించాను నా పేరు నీ కొడుక్కి పెట్టుకుంటావా అని అడుగుతాడు తాతయ్య. ఇదేం బ్లాక్ మెయిల్ ముందు ఫస్ట్ నైట్ జరగనీ తర్వాత చూద్దాం అంటాడు విక్రమ్. మరోవైపు నందు అరెస్ట్ అయిన విషయం మాధవి భర్తకి ఫోన్ చేసి చెప్తుంది తులసి. అత్తయ్య వాళ్ళు కంగారు పడుతున్నారు నందగోపాల్ గారికి బెయిల్ ఇప్పించండి అంటుంది.
అదంతా నేను చూసుకుంటాను వాళ్ళని కంగారు పడొద్దు అని చెప్పు అంటాడు మాధవి భర్త. మరోవైపు కోడల్ని అలంకరిస్తూ ఫస్ట్ నైట్ ముహూర్తం అంటే నాకు దివ్యకి అగ్ని పరీక్ష లా తయారైంది. ఈసారి ఎలాగైనా ఫస్ట్ నైట్ జరిగి తీరాలి అంటుంది రాజ్యలక్ష్మి. దివ్యని రెడీ చెయ్యు అని ప్రియ కి చెప్పి బయటికి వెళ్తారు రాజ్యలక్ష్మి ఆమె మరదలు. బయటికి వచ్చిన తర్వాత ప్రియ ని పిలిచి మీ ఇద్దరి మధ్య స్నేహం ఎక్కువ అవుతున్నట్లుగా ఉంది, సమస్య ఎక్కడ నుంచి మొదలైన నా వేట ముందు నీ మీదే జాగ్రత్త అంటూ హెచ్చరించి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. తులసి దగ్గరికి వచ్చిన దివ్యని చూసి నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటుంది దివ్య.
ఆల్ ద బెస్ట్ అంటుంది ప్రియ. కానీ ప్రియ పడుతున్న టెన్షన్ ని గమనిస్తుంది దివ్య. మరోవైపు నువ్వు ఈ ఫస్ట్ నైట్ ని ఎలాగా ఆపాలనుకుంటున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ వచ్చేస్తుంది అంటాడు బసవయ్య. చెప్పడం ఎందుకు నువ్వే చూస్తావు కదా అంటుంది రాజ్యలక్ష్మి. ఇంతలో లాస్య, దివ్యకి ఫోన్ చేసి మీ నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. గదిలో నీ భర్త దగ్గరికి వెళ్తావో కటకటాలలో ఉన్న నీ తండ్రి దగ్గరికి వెళ్తావో నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేస్తుంది. నిజం తెలుసుకొని నిర్ధాంత పోయిన దివ్య ఆమె ఇంటికి బయలుదేరుతుంది.
మరోవైపు బాధపడుతున్న అత్తగారికి ధైర్యం చెబుతూ ఉంటుంది తులసి. అంతలోనే దివ్య వచ్చి నాన్న అరెస్టు అయిన మాట నిజమేనా అని అడుగుతుంది. నిజమే అంటుంది తులసి. మరి నువ్వు ఎక్కడ ఎందుకు ఉన్నావు అంటుంది దివ్య. ఇప్పటికే వాళ్లిద్దరి మధ్యలో రావణకాష్టం రగులుతుంది మధ్యలో నేను వెళ్తే అది మరింత పెరుగుతుంది అంటుంది తులసి. తరువాయి భాగంలో రాజ్యలక్ష్మి కి ఫోన్ చేసి ఈ ఇంట్లో నేను నిప్పు పెడతాను ఇదే సమయంలో నీ కొడుకుని నువ్వు ఆయుధంగా చేసుకో అంటుంది లాస్య. బయటికి వెళ్ళేటప్పుడు కనీసం భర్తకి, అత్తగారికి కూడా చెప్పలేదు అంటూ విక్రమ్ ని రెచ్చగొడుతుంటాడు బసవయ్య.