- Home
- Entertainment
- 9 ఏళ్లలో 5300 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు హీరో, కానీ ఒక్క మాట చెప్పడానికి వణికిపోయాడు
9 ఏళ్లలో 5300 కోట్ల బిజినెస్ చేసిన తెలుగు హీరో, కానీ ఒక్క మాట చెప్పడానికి వణికిపోయాడు
టాలీవుడ్ లో హీరోగా ఎదగడం అంత సులభం కాదు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు కూడా క్రేజ్ తెచ్చుకునేందుకు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు.

Prabhas
టాలీవుడ్ లో హీరోగా ఎదగడం అంత సులభం కాదు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు కూడా క్రేజ్ తెచ్చుకునేందుకు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అలాంటిది సినిమాలంటే ఆసక్తి లేని వ్యక్తి హీరో అయితే ఎలా ఉంటుంది ? అలాంటి వ్యక్తి పదులు కాదు, వందలు కాదు, వేల కోట్ల బిజినెస్ చేస్తాడని ఎవరైనా ఊహిస్తారా ? అసలు ఆ హీరో ఎవరు ? ఏంటి అతడి కథ అనేది ఇప్పుడు చూద్దాం.
సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా హీరో రేంజ్ కి తగ్గట్లుగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. గత తొమ్మిదేళ్ల కాలంలో సినిమా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా 5300 కోట్ల బిజినెస్ చేసిన హీరో ఒకరు ఉన్నారు. అతడు ఎవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ సినిమా ఎంట్రీ చాలా విచిత్రంగా జరిగింది. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు సినీ నిర్మాత. పెదనాన్న కృష్ణంరాజు టాలీవుడ్ లో స్టార్ హీరో.
అయినప్పటికీ ఒక ఏజ్ వచ్చేవరకు ప్రభాస్ కి సినిమాల్లోకి రావడం అసలు ఇష్టం లేదు. ప్రభాస్ హీరో అవుతాడని కృష్ణం రాజు అసలు అనుకోలేదట. సినిమా అంటే దూరంగా ఉండేవాడు. ఒక రోజు ఫ్యామిలీ ఫంక్షన్ లో ప్రభాస్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడట. ఇక కృష్ణం రాజు ప్రభాస్ ని డైరెక్ట్ గా అడిగేశారట. డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నావ్, హీరో అవుతావా అని అడిగారు. ప్రభాస్ సమాధానం ఇస్తూ.. సినిమాల్లోకి రావాలని ఉంది పెదనాన్న.. కానీ ఇన్నిరోజులు మీతో చెప్పడానికి చాలా భయం వేసింది అని చెప్పాడట. వెంటనే కృష్ణం రాజు ప్రభాస్ ని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ లో చేర్పించడం జరిగింది.
ఆ విధంగా ఈశ్వర్ మూవీతో ప్రభాస్ హీరో అయ్యారు. ఫస్ట్ మూవీ ఫ్లాప్. కట్ చేస్తే బాహుబలి నుంచి ప్రభాస్ జాతకం మారిపోయింది. 2015లో బాహుబలి చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రం వరల్డ్ వైడ్ గా 650 కోట్ల బిజినెస్ చేసింది. ఈ తొమ్మిదేళ్లలో ప్రభాస్ బాహుబలి 1, బాహుబలి 2 తో కలపి మొత్తం ఏడు చిత్రాల్లో నటించారు. ఈ ఏడు చిత్రాల బిజినెస్ ఏకంగా 5300 కోట్లు దాటిపోయింది. ఇండియన్ సినిమాలో ఈ రికార్డ్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ అని చెప్పొచ్చు.
బాహుబలి 2 చిత్రం 2000 కోట్లు, సాహో 400 కోట్లు, రాధే శ్యామ్ 200 కోట్లు, ఆదిపురుష్ 350 కోట్లు, సలార్ 600 కోట్లు, కల్కి 11 కోట్ల బిజినెస్ చేశాయి. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాలకు కూడా ప్రభాస్ కమిట్ అయ్యాడు.