MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ని కావాలనే కాపీ కొట్టారా ?.. సేమ్ టు సేమ్ దింపేశారు..

'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ని కావాలనే కాపీ కొట్టారా ?.. సేమ్ టు సేమ్ దింపేశారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 29 2023, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ధమ్ మసాలా సాంగ్ ఆకట్టుకుంది కానీ ఆ తర్వాత వచ్చిన ఓ మై బేబీ సాంగ్ పై విపరీతగా ట్రోలింగ్ జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ గత చిత్రాల్లో ఉన్న సాంగ్స్ స్థాయిలో గుంటూరు కారంలో పాటలు లేవనే వాదన వినిపిస్తోంది. కాగా నేడు ఈ మూవీ నుంచి మూడవ పాట ప్రోమో రిలీజ్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ ని ఎలాగైనా ఆకట్టుకోవాలి అనే ఉద్దేశంతో మంచి మాస్ బీట్ కొట్టాడు తమన్. ఇది కేవలం ప్రోమో మాత్రమే. పూర్తి సాంగ్ రిలీజ్ కాకముందే ట్రోలింగ్ మొదలయింది. 

36

సోషల్ మీడియాలో పాపులర్ అయిన 'కుర్చీ మడత పెట్టి' అనే మాటతో ఈ పాటని రాసినట్లు అర్థం అవుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన విషయాలని సినిమాల్లో వాడేస్తున్నారు. గుంటూరు కారం చిత్రం కోసం తమన్ అదే ప్రయత్నించారు. 

46

అయితే ఈ సాంగ్ మహేష్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మాస్ డ్యాన్స్ తో మహేష్, శ్రీలీల పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. మహేష్ బాబు లాంటి హీరోతో ఎలాంటి పాటలు చేయిస్తున్నారు అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. 

56

దీనికి తోడు ఈ సాంగ్ పై కాపీ అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుర్చీ మడత పెట్టి అనే మాటతో ఆల్రెడీ యూట్యూబ్ లో డీజే సాంగ్ వచ్చేసింది. తమన్ సేమ్ ట్యూన్ ని గుంటూరు కారం కోసం ఉపయోగించారు. అయితే తమన్ కావాలనే అదే సాంగ్ ని పెట్టారా లేక కాపీ చేసారా అనేది తెలియదు. కానీ ట్రోలింగ్ మాత్రం ఒక రేంజ్ లో జరుగుతోంది. 

66

ఓ మై బేబీ సాంగ్ కి ఎంత పెద్ద రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్రోలింగ్ నెగిటివిటి భరించలేక గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ కి దూరమయ్యారు. ఈ సాంగ్ కి లిరిక్స్ అందించింది కూడా ఆయనే. కంప్లీట్ సాంగ్ శనివారం డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image2
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image3
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved