రజినీకాంత్ తో సినిమా చేసి సొంత ఇల్లు కట్టుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
దాదాపు 24 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన రజినీకాంత్ సినిమాతో స్టార్ డైరెక్టర్ సెటిల్ అయ్యాడు. అంతే కాదు ఒక ప్లేస్ కొనుక్కుని ఇల్లు కూడా కట్టుకున్నాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా?

సూపర్ స్టార్ రజినీకాంత్ 170కి పైగా సినిమాల్లో నటించారు. గత సంవత్సరం వచ్చిన జైలర్ సినిమా సూపర్ హిట్. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నారు తలైవా. 70 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్.
ఇక కూలీ సినిమా సినిమా ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు టీమ్. అందులో భాగంగా ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను అనిరుధ్, విజయ్ పాడారు.
350 కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు కింగ్ నాగార్జున, విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్ లాంటి స్టార్స్ నటించారు. ఇక ఈక్రమంలో రజినీకాంత్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో రజినీకాంత్ గతంలో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సినిమాలకు సబంధించిన సమాచారం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రజినీకాంత్ నటించిన హిట్ సినిమాలలో నరసింహా మూవీ ఒకటి( పడయప్ప) ఈ సినిమా తమిళంలో పడయప్పగా, తెలుగులో నరసింహాగా రిలీజ్ అయ్యింది. ఈమూవీ రిలీజ్ అయ్యి లై 24 ఏళ్ళు అవుతుంది. రజినీ కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఈసినిమాతో రజినీకాంత్ తో పాటు హీరోయిన్ రమ్యకృష్ణకి కూడా మంచి పేరు వచ్చింది. ఆమె నీలాంబరి పాత్రలో అద్భుతంగా నటించింది.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు శివాజీ గణేషన్, రమ్యకృష్ణ, సౌందర్య, రాధారవి, రాజా రవీంద్ర, సెంథిల్, రమేష్ కన్నా వంటి నటీనటులు నటించారు. 1999 ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమాకి 24 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ మామూలుగా ఉండదు. టీవీలో టెలికాస్ట్ అయితే టీఆర్పీలు అదిరిపోవాల్సిందే.
ఇక ఈసినిమా కు సబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి రీసెంట్ గా వైరల్ అయ్యింది. ఈసినిమా కోసం దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? అప్పట్లో అంటే దాదాపు 25 ఏళ్ల క్రితమే ఈ సినిమాకోసం దర్శకుడికి 65 లక్షలు ఇచ్చారట. అంతే కాదు ఈ డబ్బుతో ఆయన ఒక స్థలం కొని అందులో ఇల్లు కూడా కట్టుకున్నారట. ప్రస్తుతం రవికుమార్ ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇ
అంతేకాదు, అప్పట్లోనే నరసింహ సినిమా భారీ కలెక్షన్లు కూడా సాధించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కలిసి నరసింహ సినిమా 58 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక ఈ టైమ్ లో మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంటున్నారు అభిమానులు.