Kriti Sanon : యాడ్ షూట్ కోసం రెచ్చిపోయిన కృతి సనన్... పొట్టి డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ మెరుపులు!
బాలీవుడ్ నటి కృతి సనన్ Kriti Sanon స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ఈ ముద్దుగుమ్మ ఫొటోలకు ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపే దక్కించుకుంది. ‘దోచేయ్’, ‘వన్ నేనొక్కడినే’ వంటి చిత్రాలతో టాలీవుడ్ లో అదరగొట్టింది. కానీ సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది.
చివరిగా ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సీతాదేవి పాత్రలో ఒదిగిపోయింది. ఆ చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. సీతగా కృతి సనన్ కు మాత్రం మంచి పేరు వచ్చింది.
ప్రభాస్ సరసన నటించిన తర్వాత కృతి సనన్ కు మరింత క్రేజ్ దక్కింది. ముఖ్యంగా దక్షిణాది ఆడియెన్స్ లో మంచి గుర్తింపు వచ్చింది. ‘ఆదిపురుష్’ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సౌత్ నుంచి పెద్దగా ఆఫర్లు రావడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. రీసెంట్ గానే టైగర్ ష్రాఫ్ సరసన కృతి సనన్ నటించింది. ‘థేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’తో ప్రేక్షకులను అలరించింది. నెక్ట్స్ మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన గురించిన విషయాలను పంచుకుంటుంది. అలాగే పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ కు పరిచయం చేస్తూ వస్తోంది.
తాజాగా స్కిన్ కేర్ కు సంబంధించిన ఓ ప్రాడక్ట్ కోసం ఫొటోషూట్ చేసింది. చర్మ సౌందర్యాన్ని చూపించేలా పొట్టి డ్రెస్ లో మెరిసింది. స్కిన్ టోన్ తో మతులు పోగొట్టింది. క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.