- Home
- Entertainment
- కృతి శెట్టి ఇంత కసిగా చూస్తే ఎలా.. దిమ్మతిరిగే అందాలు, నీ కళ్ళే మిస్టరీ అంటూ నెటిజన్ల కామెంట్స్
కృతి శెట్టి ఇంత కసిగా చూస్తే ఎలా.. దిమ్మతిరిగే అందాలు, నీ కళ్ళే మిస్టరీ అంటూ నెటిజన్ల కామెంట్స్
డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
కృతి శెట్టి ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ' ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', అనే చిత్రంలో.. సూర్య సరసన మరో చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో అయినా ఐరెన్ లెగ్ ముద్ర తొలగించుకోవాలని కృతి శెట్టి భావిస్తోంది. దీనికోసం కృతి శెట్టి గ్లామర్ ఇంటెన్స్ పెంచేసినట్లుగా అర్థం అవుతోంది.
తాజాగా కృతి శెట్టి వైట్ డిజైనర్ శారీలో బ్యాక్, నడుము అందాలు చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. సైమా అవార్డ్స్ వేడుకలో కళ్ళు చెదిరే శారీలో విరబోసిన కురులతో కృతి ఇస్తున్న లుక్స్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. సైమా అవార్డ్స్ వేడుకలో కృతి శెట్టి ఇలా మెరిసింది.
కృతి శెట్టి ఈ రేంజ్ లో అందాలు అరబోయడంతో చూపు తిప్పుకోవడం కష్టంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అన్ని యాంగిల్స్ తో తన పరువాలని కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ లాగా చూపిస్తోంది. ఆమె కళ్ళే ఒక మిస్టరీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కసి చూపులతో ఆమె చూస్తున విధానం ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది.
సుధీర్ సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ విజయంపై కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు.