నేనెప్పుడు అలా చెప్పలేదు, పుకార్లపై స్పందించిన కృతీ శెట్టి..
తాను చేస్తున్నట్టుగా వస్తున్న కొన్ని వ్యాక్యలపై స్పదించింది హీరోయిన్ కృతీ శెట్టి. తాను అనని మాటలను కూడా అన్నట్టు సృష్టించారన్నారు కృతీ శెట్టి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతీ శెట్టి.. ఈసినిమాతో తనకంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతే కాదు వరుస అవకాశాలు కూడా సాధించింది బ్యూటీ. ఉప్పెన తరువాత వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ.. ఆతరువాత వరుసగా ఫెల్యార్న్స్ను ఫేస్ చేసింది.
ఇప్పుడిప్పుడు కోలుకుని అవకాశాలు సాధిస్తోంది కృతీ శెట్టి. తాజాగా తమిళంలో జయం రవితో ఓ సినిమాలో నటిస్తోంది. మలయాళంలో మరో సినిమా చేస్తుంది. టాలీవుద్ నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది కృతీ శెట్టికి. ఇక పోతే.. కృతీ శెట్టికి సబంధించి ఓన్యేస్ సోషల్ మీడియా అంతటా వ్యాపించింది. గతకొన్ని రోజులుగా కృతి శెట్టి ఇంటర్వ్యూ అంటూ పలు కథనాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఓ స్టార్ హీరో కొడుకు తనను వేధిస్తున్నాడని.. స్నేహం పేరు చెప్పి.. వెంటపడుతున్నాడని.. ఎక్కడికి వెళ్లినా తోడు రమ్మంటున్నాడని, ఎంత డబ్బయితా ఇస్తానంటున్నాడంటూ.. కృతి శెట్టి చెప్పినట్టుగా ప్రచారం జరిగింది. కొన్ని రోజులుగా ఈన్యేస్ వైరల్ అవుతూ వస్తోంది. ఈ విషయంలో స్పందించింది హీరోయిన్ కృతీ శెట్టి.
Krithi Shetty
ఈ కథనాలపై నటి కృతి శెట్టి స్పందించారు. ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తానెప్పుడూ అలా చెప్పలేదని కొట్టిపారేశారు. ఈ పుకార్లను పట్టించుకోకూడదని భావించానని, కానీ తప్పుడు ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతుండడంతో స్పందించక తప్పలేదని వివరణ ఇచ్చారు.
అవన్నీ నిరాధారమైన వార్తలని, వాటిని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు కృతి శెట్టి ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు కథనాలు వండి వార్చడం ఆపేయాలని.. ఇకనైనా ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలంటూ.. మీడియా సంస్థలకు కృతీ శెట్టి హితవు పలికారు.